కూతురుని హీరోయిన్ చేయడం కోసం శేఖర్ మాస్టర్ తప్పుడు పని.. ఫైర్ అవుతున్న ఫ్యాన్స్..!?

సినీ ఇండస్ట్రీలో శేఖర్ మాస్టర్ అన్న పేరుకు కొత్త పరిచయాలు అవసరం లేదు. కొరియోగ్రాఫర్ గా మంచి మంచి స్టెప్స్ ను కంపోజ్ చేస్తూ.. స్టార్ హీరోల సినిమాలకు కొరియోగ్రాఫర్ గా వర్క్ చేస్తూ.. తన పేరుని అందరికీ తెలిసేలా చేసుకున్నాడు. అంతేకాదు బుల్లితెరపై పలు డాన్స్ షోలకు జడ్జిగా వ్యవహరిస్తూ శేఖర్ మాస్టర్ తన పేరును జనాల్లోకి మరింత ఎక్కువగా తీసుకెళ్లాడు. శేఖర్ మాస్టర్ ఖాతాలో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలు ఉన్నాయి. సినిమా ఫ్లాప్ అయినా కానీ ఆ పాటకు డాన్స్ కొరియోగ్రఫీ చేసిన శేఖర్ మాస్టర్.. సూపర్ హిట్ అయ్యారు.

బుల్లితెరపై షోస్ చేస్తూనే తన కూతురు సాహితీని కొడుకును జనాలకు పరిచయం చేశాడు. మరీ ముఖ్యంగా తన కొడుకు బుల్లితెరపై పలు షోస్ లో ఈవెంట్స్ లో పాల్గొని నాన్న పేరుని నిలబెట్టాడు. శేఖర్ మాస్టర్ తో ధీటుగా స్టెప్ వేస్తూ చిచ్చరపిడుగు అనిపించుకున్నాడు . కాగా ఇప్పుడు తన కూతురు సాహితీ వంతు వచ్చింది. మనకు తెలిసిందే సాహితి చూడడానికి కుందనపు బొమ్మలా ఉంటుంది . ఈ కాలం హీరోయిన్స్ ఆమె అందం ముందు ఎక్కడికి పోవాలో . వల్గారిటీ అస్సలు తెలీదు.. మోడ్రెన్ గా ఉంటుంది. కానీ పద్ధతిగా ఉంటుంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సాహితీ త్వరలోనే సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ గా పరిచయం కాబోతుంది అంటూ ఓ న్యూస్ వైరల్ గా మారింది.

శేఖర్ మాస్టర్ పలుకుబడితో తన కూతుర్ని సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్గా పరిచయం చేయబోతున్నాడు అంటూ ఓ న్యూస్ తెగ హల్చల్ చేస్తుంది . అయితే దీనిపై శేఖర్ మాస్టర్ అభిమానులు ఆయనను తప్పుపడుతున్నారు . “సాహితీని ఈ మురికి కుంటలోకి తీసుకురావద్దని ..ఇది తన జీవితానికి బిగ్గెస్ట్ మైనస్ అవుతుందని ..సినిమా ఇండస్ట్రీ అంటే ఎంత చెత్తగా ఉంటుందో నీకు తెలిసి కూడా నువ్వు నీ కూతుర్ని ఇలాంటి మురికిలోకి దించడానికి ట్రై చేస్తున్నావా ..? ప్లీజ్ వద్దు శేఖర్ సాహితీని చదువుకోమని చెప్పు.. కొరియోగ్రాఫర్ గా అయిన రానివ్వు కానీ హీరోయిన్గా మాత్రం వద్దు ..”అంటూ కామెంట్స్ చేస్తున్నారు . అంతేకాదు సాహితీది హీరోయిన్ ఏజ్ అస్సలు కాదు చదువుకుంటుంది . చాలా అందంగా ఉంటుంది. ఎటువంటి డ్యాన్స్ ని అయినా ఎక్స్ప్రెషన్స్ తో పలికిస్తూ అందరిని ఆకట్టుకుంటుంది . మరి అలాంటి అమ్మాయిని హీరోయిన్గా మార్చి తన జీవితం నాశనం చేస్తావా అంటూ జనాలు మండిపడుతున్నారు. దీంతో సాహితీని హీరోయిన్గా జనాలు యాక్సెప్ట్ చేయలేరని క్లియర్ గా అర్థం అయిపోయింది . మరి చూడాలి శేఖర్ మాస్టర్ దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో..?