వరుస ఫ్లాపులు..గతిలేక అలాంటి పనికి యస్ చెప్పిన పూజా..ఇండస్ట్రీ షాక్..!?

ముకుంద సినిమాతో టాలీవుడ్లోకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన పూజ హెగ్డే ..మొదటి సినిమాతో పర్లేదనిపించింది. ఇక తర్వాత వచ్చిన అన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. అమ్మడు దురదృష్టమో లేక కంటెంట్ బాగోలేదు తెలియదు కానీ ..దాదాపు ఆమె చేసిన అన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద భారీ డిజాస్టర్ టాక్ ను సొంతం చేసుకున్నాయి. ఈ క్రమంలోనే బాలీవుడ్ లో కూడా తన లక్ ని పరీక్షించుకుంది అక్కడ కూడా హృతిక్ రోషన్ తో చేసిన సినిమా భారీ డిజాస్టర్ ను సొంతం చేసుకుంది.

ఈ క్రమంలోనే పూజకు ఐరన్ లెగ్ అంటూ ఒక ట్యాగ్ ఇచ్చారు . అమ్మడుతో సినిమాలు చేసిన హీరోల కెరియర్ నాశనం అయిపోతుందని.. డైరెక్టర్, ప్రొడ్యూసర్ దివాలా తీయాల్సి వస్తుందని ..రూమర్స్ క్రియేట్ చేసారు . దీంతో ఒక్కసారిగా పూజా హెగ్డే కెరియర్ డౌన్ ఫాల్ అయింది . అయితే ఎవరు ఊహించిన విధంగా బన్నీ ఆమెకు ఛాన్స్ ఇవ్వడం.. దువ్వాడ జగన్నాథం సినిమాతో కొంచెం ఫామ్ లోకి వచ్చింది . ఆ తర్వాత ఎన్టీఆర్ సరసన నటించిన అరవింద సమేత వీర రాఘవ సినిమా హిట్ అవ్వడంతో ఒక్కసారిగా పూజా హెగ్డే టర్న్ అయింది.

అప్పటి నుంచి పూజ హెగ్డే చేసిన ప్రతి సినిమా హిట్ అవుతూ వచ్చింది.. భారీ కలెక్షన్లు సాధిస్తూ నిర్మాతలకు లాభాలు తీసుకురావడంతో ఒక్కసారిగా ఆమెను ఐరన్ లెగ్ నుంచి అదృష్ట దేవతగా మార్చేసారు జనాలు . ఈ క్రమంలోనే మళ్లీ ఐరెన్ లెగ్ అంటూ ట్యాగ్ చేశారు జనాలు. ఈ మధ్యనే ఆమె నటించడం మూడు సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. పూజ కెరియర్ మళ్ళీ డౌన్ ఫాల్ అయింది . అయితే తన కెరియర్ ఎలాగైనా స్పీడ్ అప్ చేయడానికి పూజ వద్దనుకుని నో చెప్పిన ఆఫర్ ను మళ్ళీ ఎస్ చెప్పినట్లు తెలుస్తుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ కాంబోలో రాబోతున్న భవదీయుడు భగత్ సింగ్ సినిమాలో మొదట హీరోయిన్గా అనుకున్నింది పూజా హెగ్డే నే.. కానీ సినిమా లేట్ అవుతున్న కారణంగా పూజ హెగ్డే ప్రాజెక్ట్ నుంచి తప్పుకుందట.

అయితే పూజకు బయట పెద్దగా ఆఫర్లు రాకపోవడం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ట్రోల్ చేయడంతో పూజ గతిలేక మళ్ళీ ఇష్టం లేకపోయినా కానీ ఈ సినిమాకు హీరోయిన్ గా నటించడానికి ఒప్పుకుందట . ఈ సినిమాలో హీరోయిన్గా పూజ హెగ్డే అంటూ చెప్పకనే చెప్పేసాడు హరీష్ శంకర్ . రీసెంట్గా పుట్టినరోజు సందర్భంగా ఆమెకి విష్ చేస్తూ త్వరలోనే సెట్స్ పై కలుద్దాం పూజ అంటూ చెప్పుకొచ్చాడు. దీంతో భవదీయుడు భగత్ సింగ్ లో పూజా హీరోయిన్ అని అందరూ ఫిక్స్ అయిపోయారు.