బాలకృష్ణ సినిమాను ఫాలో అవుతున్న సలార్ డైరెక్టర్.. నో డౌట్ హిట్ పక్కా..!

గత సంవత్సరం బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబోలో వచ్చిన అఖండ సినిమా బాలకృష్ణ కెరియర్ లోనే ఎవరు ఊహించని సెన్సేషనల్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాతో బాలకృష్ణ 100 కోట్ల క్లబ్ లో చేరిపోయాడు. ఇప్పుడు బాలకృష్ణ వ‌రుస‌ సినిమాలతో బిజీగా ఉన్నాడు. అఖండ సినిమా స్టోరీ మొత్తం శివతత్వం గురించి ప్రేక్షకులకు అర్థమయ్యే విధంగా చెప్పే ప్రయత్నం చేశారు దర్శకుడు. తాజాగా వచ్చిన కార్తికేయ2 సినిమా లో కూడా కృష్ణ తత్వం గురించి ప్రేక్షకులకు అర్థమయ్యే విధంగా చెప్పి బ్లాక్ బస్టర్ విజయం అందుకున్నాడు దర్శకుడు.

ఈ రెండు సినిమాల్లో ఉన్న కామన్ పాయింట్ దైవత్వం . ఈ కామన్ పాయింట్ నే ఇప్పుడు ఓ స్టార్ దర్శకుడు తన సినిమాలో చూపించబోతున్నాడు అని తెలుస్తుంది. కే జి ఎఫ్ సినిమాలతో పాన్ ఇండియా డైరెక్టర్గా పేరు తెచ్చుకున్న దర్శకుడు ప్రశాంత్ నీల్‌. ఇక ఈ సినిమాలు తర్వాత ప్రశాంత్ ప్రభాస్ తో సలార్ సినిమా తెరకెక్కిస్తున్నాడు. అయితే ఈ సినిమాకు సంబంధించిన ఒక వార్త బయటకు వచ్చింది. ప్రశాంత్ నిల్‌ ఈ సినిమాలో కూడా అఖండ సినిమా లాగా స్టోరీ మొత్తం దేవుని చుట్టూ తిరిగే విధంగా ఉంటుందని తెలుస్తుంది.

Prabhas hints at 'Salaar' being a two-part action movie | Telugu Movie News  - Times of India

ప్రశాంత్ నీల్‌ ఈ సినిమాలో కాళీమాత విగ్రహం చుట్టూ కాసేపు కథ తిరుగుతుందని అంటున్నారు. ఈ సినిమాలో కాళీమాత చుట్టూ వచ్చే సన్నివేశం సినిమాకి హైలెట్ గా ఉంటుందని తెలుస్తుంది. సినిమా కథ కూడా మొదలయ్యేది కాళీమాత విగ్రహం దగ్గరట. క్లైమాక్స్ లో వచ్చే ఫైట్ కూడా అభిమానులను బాగా ఆకట్టుకుంటుందని తెలుస్తుంది. బాలకృష్ణ సినిమాను ఫాలో అవుతున్న ప్రశాంత్ నీల్ అఖండలాగా సలార్ సినిమా హిట్ అవుతుందో లేదో చూడాలి.