ఇంట్రెస్టింగ్: అప్పుడు లేచిన నోర్లు..ఇప్పుడు లేవలేదు ఏం..!!

సోషల్ మీడియాలో ఎప్పుడు ట్రోల్ అయ్యే మ్యాటర్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లు మ్యాటర్ టాప్ ప్లేస్ లో ఉంటుంది . పని లేని ప్రతి ఒక్కడికి పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్ల గురించే అవసరం. అది సినిమాల పరంగా కానివ్వండి రాజకీయాల పరంగా కానివ్వండి ..పవన్ కళ్యాణ్ ఉ అంటే మూడు పెళ్లిళ్లు ..ఊ ఊ అంటే మూడు పెళ్లిళ్లు ..పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడినా అటు తిరిగి ఇటు తిరిగి ..చివరకు ఆయన పర్సనల్ లైఫ్ దగ్గరికి వచ్చే ఆగుతారు కొందరు సో కాల్డ్ పొలిటీషియన్స్. దీంతో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా ప్రతిసారి అలాంటి వాళ్లకు ఆన్సర్ ఇచ్చి ఇచ్చి అలిసిపోయారు. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ అలాంటి వాళ్ళ నోర్లు మూయించడానికి డైరెక్టుగా ప్రెస్ మీట్ పెట్టి మరి అఫీషియల్ గా మూడు పెళ్లిళ్ల మ్యాటర్ మాట్లాడే వాళ్ళకి పగిలిపోయే ఆన్సర్ ఇచ్చారు.

కొన్ని గంటల క్రితం విజయవాడలో జనసేన కార్యకర్తలతో , మీడియా మిత్రులతో మాట్లాడిన పవన్ కళ్యాణ్ ..ఓ రేంజ్ లో ఊగిపోయారు . ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ ని మనం ఇలా ఎన్నడు చూడలేదు . ఏ సినిమాలో కూడా ఇంతటి హైపర్ఫామెన్స్ లు మనం చూడలేదు . అలాంటి కోపానికి ఆవేశానికి లోనైపోయారు పవన్ కళ్యాణ్ . ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ..” ప్రతి ఒక్కడికి నా మూడు పెళ్లిళ్ల గురించి కావాలి. అవును నేను మూడు పెళ్లిళ్లు చేసుకున్నాను ..ఇద్దరు భార్యలకు విడాకులు ఇచ్చి ..మూడో పెళ్లి చేసుకున్నాను.. అఫీషియల్ గా చట్టబద్ధంగానే నేను డివర్స్ ఇచ్చాను. ఎవరికి అన్యాయం చేయలేదు. నా మొదటి భార్యకి ఐదు కోట్లు భరణంగా ఇచ్చాను . రెండో భార్యకి కోట్ల ఆస్తిని ఇచ్చాను. మీకు అవసరమైతే మీరు చేసుకోండి మూడు పెళ్లిళ్లు ..ఒక భార్యని పెట్టుకొని 30 స్టెప్నీలతో ఎంజాయ్ చేసే మీరా నన్ను ప్రశ్నించేది ..?”అంటూ ఘాటుగా స్పందించారు .

అయితే ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ ఎప్పుడు తన మాజీ భార్యలకు ఇచ్చిన భరణం గురించి ప్రస్తావించలేదు . ఫస్ట్ టైం విజయవాడ వేదికగా మాట్లాడేసరికి ఆయన మాటలు వైరల్ గా మారాయి .అంతేకాదు మొదటి భార్య నందిని గురించి జనాలు పెద్దగా పట్టించుకోలేదు. ఆమె ఎప్పుడు వచ్చిందో ఎప్పుడు వెళ్ళిపోయింది ఎవరికి తెలియదు . కానీ రెండో భార్య రేణు దేశాయ్ మాత్రం పవన్ కళ్యాణ్ గురించి ఎప్పుడు చెప్పుకొస్తూనే ఉంది . ఆయన వ్యక్తిత్వం గురించి మంచిగా చెప్పే రేణు దేశాయ్.. ఆయన నాకు ఒక్క రూపాయి భరణం ఇవ్వలేదని చాలా మీడియా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది .

మరి పవన్ కళ్యాణ్ ఏమో ఆస్తిని ఇచ్చాను అని ఓపెన్ గానే చెప్పాడు. దీంతో రేణు దేశాయ్ అబద్ధం చెప్పిందా ..?అంటూ ఓ చర్చ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . అంతేకాదు మాటకు ముందు పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లు అనే మాటను లేవదీసే సో కాల్డ్ బ్యాచ్.. పవన్ కళ్యాణ్ మాటలకు మీరు ఏమి ఆన్సర్ ఇస్తారు అంటూ ఆయన వీడియో క్లిప్స్ వైరల్ చేస్తున్నారు పవన్ ఫ్యాన్స్ . మరి చూడాలి పవన్ ని విమర్శించే వాళ్లు ఈ వీడియోకి ఏం ఆన్సర్ ఇస్తారో.. అలాగే రేణు దేశాయ్ పవన్ భరణంపై ఎలా స్పందిస్తుందో..?