బాబాయ్ తో కలవబోతున్న అబ్బాయిలు… నందమూరి అభిమానులు కోరుకుంటున్న రోజు..!

నందమూరి బాలకృష్ణ ఆహా వేదికగా వ్యాఖ్యాతాగా చేస్తున్న అన్ స్టాపబుల్ షో మొదటి సీజన్ ఎంతో విజయవంతంగా పూర్తి చేసుకుంది. గత నెలలో ఈ షో కు రెండో సీజన్ కూడా ప్రారంభమైంది. ఈ సీజన్ తొలి ఎపిసోడ్ గాను బాలకృష్ణ బావమరి అయినా చంద్రబాబు నాయుడు, బాలయ్య అల్లుడు లోకేష్ ముఖ్య అతిథులుగా వచ్చారు. తర్వాత రెండో ఎపిసోడ్ గాను యువ హీరోలు సిద్దు జొన్నలగడ్డ, విశ్వక్‌సేన్‌ లు గెస్టులుగా వచ్చారు.

Jr NTR Wishing Balakrishna: Big Disappointment!

ఈ క్రమంలోనే ఈ షోకు జూనియర్ ఎన్టీఆర్ ని పిలవాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఇందులో భాగంగా బాలయ్య షోకు జూనియర్ ను ఎలాగైనా తీసుకువచ్చే పనిలో పడిందంట ఆహా టీమ్‌. ఈ షోలో జూనియర్ ఎన్టీఆర్ మాత్రమే కాకుండా ఆయన అన్న కళ్యాణ్ రామ్‌ని కూడా తీసుకురావాలని చూస్తున్నారా అంటూ ఓ న్యూస్ వైరల్ గా మారింది.

Kalyan Ram reunites Balayya and Jr NTR!

జూనియర్ ఎన్టీఆర్ త్రిబుల్ ఆర్ ప్రమోషన్ లో భాగంగా జపాన్లో ఉన్నారు. కళ్యాణ్ రామ్ ప్రస్తుతం ఆయన నటించిన ‘బింబిసార’ సక్సెస్ జోష్‌లో ఉన్నారు. . ఇక ఈ క్రమంలోనే అన్ స్టాపబుల్ లాస్ట్ ఎపిసోడ్ గాను ఈ అన్నదమ్ముల ఇద్దరినీ ఈ షోకి తీసుకురావాలని ప్రయత్నాలుచేస్తున్నారట ఆహా టీమ్‌. ఈ అన్నదమ్ములు ఇద్దరు కలిసి బాబాయితో చేసే అల్లరి చూడడానికి నందమూరి అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు. త్వరలోనే దీనిపై అఫీషియల్ ప్రకటన రానున్నట్టు తెలుస్తుంది. మరి చూడాలి బాబాయితోో అబ్బాయిల అల్లరి ఎలా ఉండబోతుందో..