అమ్మ మాట విని..ఆయన ఇంటికి వెళ్లడానికి సిద్ధపడిన కృతిశెట్టి..ఇండస్ట్రీలో హాట్ టాపిక్ ఇదే..!?

పాపం కన్నడ బ్యూటీ కృతి శెట్టి కోటి ఆశలతో సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. తన అదృష్టమో దురదృష్టమో తెలియదు కానీ వరుసగా మూడు సినిమాలు హిట్ట అయ్యాయి. దీంతో అమ్మడుకి ఆకాశమంత ఫ్యాన్ ఫాలోయింగ్ దక్కించుకునేలా చేసింది. దీంతో ఆమె ఫాన్స్ కృత్తి శెట్టిని ఓ రేంజ్ లో పొగిడేసారు . కృతి కత్తి లాంటి ఫిగర్ అని, పట్టుకుంటే హిట్, ముట్టుకుంటే బ్లాక్ బస్టర్ అంటూ రకరకాలుగా కామెంట్ చేశారు.

సీన్ కట్ చేస్తే వరుసగా మూడు బ్లాక్ బస్టర్ హీట్లను తన ఖాతాలో వేసుకున్న కృతి శెట్టి ..వెంటనే వరుసగా మూడు డిజాస్టర్లను తన ఖాతాలో వేసుకుంది. దీంతో ఎంత త్వరగా ఆకాశానికి ఎత్తేసారో జనాలు.. అంత త్వరగా ఆమెను డీఫేం చేశారు. పడిపోయేలా చేశారు . దీంతో కృతి శెట్టి కెరియర్ గ్రాఫ్ అమాంతం పడిపోయింది. అంతేనా ఇప్పుడు కృతి శెట్టి పేరు చెప్తే డైరెక్టర్స్ వణికి పోతున్నారు. వరుసగా హిట్ సినిమాలు ఖాతాలో వేసుకున్నప్పుడు కృత్తి శెట్టి ఇంటికి క్యూ కట్టిన డైరెక్టర్లు.. ఇప్పుడు కృత్తి పేరు చెప్తే భయపడిపోతున్నారు. మాకు వద్దు ఈ ఐరన్ లెగ్ అంటూ ఆమెను దూరం పెడుతున్నారు. ఈ క్రమంలోనే కృతి శెట్టి కెరియర్ బాగుపడడానికి వాళ్ళ అమ్మగారు సంచలన నిర్ణయం తీసుకున్నట్లు మీడియాలో న్యూస్ వైరల్ గా మారింది.

అందుతున్న సమాచారం ప్రకారం కృత్తి శెట్టి జాతకంలో ఏదో దోషం ఉందని ప్రజెంట్ ఆమె టైం బాగోలేదని.. అందు కారణంగానే ఆమె కెరియర్ ఇలా సాగుతుందని ఎవరో పండితులు చెప్పారట . దీంతో కృతిశెట్టి జాతకాన్ని ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామికి చూయించాలని కృత్తి అమ్మగారు డిసైడ్ అయ్యారట. దీనికి మొదట కృత్తి ఒప్పుకోలేదట.. ఇలాంటివి నేను నమ్మను అంటూ మొండి చేసిందట. కానీ వరుసగా ఇలా అన్ని సినిమాలు దెబ్బ తినడం ఆమెకు ఇలాంటి చెత్త పేరు రావడంతో భయపడిన కృత్తి శెట్టి ..ఎట్టకేలకు వేణుస్వామి కలవడానికి ఒప్పుకునిందట .

ప్రజెంట్ ఇదే న్యూస్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. మరి చూడాలి వేణు స్వామిని కలిశాక కృతిశెట్టి జాతకంలోని దోషాల గురించి ఏ విషయాలు బయట పడతాయో.. ఆమె కెరియర్ ఎలా ఉందని చెప్తారో..? అంటూ కృతి శెట్టి ఫాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఏది ఏమైనా రష్మిక మందన లాగే కృతశెట్టి కూడా టోటల్ తన జీవితాన్ని వేణు స్వామి చేతిలో పెట్టడానికి సిద్ధపడిపోయింది అంటూ కొందరు జనాలు కామెంట్ చేస్తున్నారు.

Share post:

Latest