ఆ త‌ప్పు వ‌ల్లే నిత్యా మీన‌న్ కెరీర్ డేంజ‌ర్ జోన్ లో ప‌డిందా?

నిత్యామీనన్.. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ లలో ఒకరు. అందాల అపరంజి బొమ్మలా ఉంటే నిత్యామీనన్ నటనతో ప్రేక్షకులలో తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకుంది. ఈమె గ్లామర్ రోల్స్ కంటే అభినయం ఉన్న పాత్రలకే ప్రాధాన్యమిస్తుంది. అందుకే ఒకప్పుడు వరుస అవకాశాలతో బిజీగా ఉన్న నిత్య ప్రస్తుతం పరిమితంగా సినిమాలలో నటిస్తుంది.

నిత్యామీనన్ ఇటీవల సినిమాలలో కంటే సోషల్ మీడియాలోని ఎక్కువగా కనిపిస్తూ ప్రేక్షకులను అలరిస్తుంది. అయితే బాలీవుడ్ ప్రముఖ సంస్థ దగ్గర ఈమె డేట్స్ ఉన్నాయని.. ఆ సంస్థ పర్మిషన్ లేకుండా నిత్య ఏ సినిమాకైనా డేట్స్ కేటాయించలేరని సమాచారం. అయితే అదంతా సులువు కాదని ఆ సంస్థను సంప్రదించడం కొంచెం కష్టంతో కూడుకున్న పని అని తెలుస్తుంది.అయితే ఆ తప్పు వల్లే నిత్యామీనన్ కెరీర్ డేంజర్ జోన్ లో పడిందని కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి.

నిత్య కెరీర్ విషయంలో ఎంతో జాగ్రత్తగా ముందుకు వెళ్లాల్సి ఉంది. నిత్య గ్లామరస్ రోల్స్ కూడా నటించి ఉంటే కెరీర్ పరంగా ముందంజలో ఉండేదని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈమెకు ఇటు తెలుగులో కన్నా అటు తమిళంలోనే ఎక్కువ సినీ అవకాశాలు వస్తున్నాయి. నిత్యామీనన్ 10 ఏళ్లకు పైగా సినీ ఇండస్ట్రీలో కెరీర్ కొనసాగించడం గమనార్హం. అయితే ప్రస్తుతం నిత్యామీనన్ వరస సినిమాలు చేయాలని మరింత సక్సెస్ ను సాధించాలని తన అభిమానులు వారి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. వారి కోరిక ఎప్పటికీ నెరవేరుతుందో రాబోయే కాలంలో చూడాల్సి ఉంది.