కోహ్లీ ఆటకు డాన్స్ చేసిన అనుష్క.. పోస్ట్ వైరల్..!

టి20 వరల్డ్ కప్ లో భాగంగా నిన్న జరిగిన ఇండియా- పాకిస్తాన్ మ్యాచ్ ఎంతో ఉత్కంఠ గా నరాలు తెగే విధంగా మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో భారత జట్టు అదిరిపోయే విక్టరీ కొట్టింది. ఇక ఈ మ్యాచ్ లో భారత్ స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ అదిరిపోయే ఇన్నింగ్స్ ఆడి భారత్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యాతోో కలిసి భారత్‌ను గెలిపించాడు. ఎంతో ఉత్కంఠమైన మ్యాచ్‌లో భారత్ విజయం సాధించడం పట్ల పలువురు ప్రముఖులు అభిమానులు సోషల్ మీడియా వేదిక ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

I want to win Asia Cup and T20 World Cup for India: Virat Kohli | Deccan Herald

అయితే తాజాగా ఈ విజయంపై విరాట్ కోహ్లీ భార్య అనుష్క శర్మ స్పందిస్తూ.. విరాట్ ను ప్రశంసల వర్షంలో ముంచెత్తే పోస్ట్ ను తన ఇంస్టాగ్రామ్ అకౌంట్లో షేర్ చేసింది. ఇన్‌స్టాలో అనుష్క శర్మ రాస్తూ..’ ఈ దీపావళికి ప్రజల జీవితాల్లో ఆనందాన్ని నింపారు. మీరు ఒక అద్భుతం. మీ పట్టుదల, నమ్మకం, మనస్సును కదిలించేలా ఉన్నాయి. నా జీవితంలో మీ అత్యుత్తమ మ్యాచ్ చూశా. నేను మ్యాచ్ జరుగుతున్న సమయంలో డ్యాన్స్‌ చేస్తుంటే మా పాపకు అర్థం కానీ పరిస్థితి. కానీ ఏదో ఒక రోజు తన తండ్రి అత్యుత్తమ ఇన్నింగ్స్ ఆడారని తెలుసుకుంటుంది. అత్యంత కఠిన పరిస్థితుల నుంచి ఎన్నడు లేనంతగా పుంజుకున్నారు మీరు. మిమ్మల్ని చూస్తే చాలా గర్వంగా ఉంది. మీపై నా ప్రేమ అపరిమితం’ అంటూ రాసుకొచ్చింది.

Virat Kohli brutally trolled for Asia Cup and T20 World Cup remarks

ఈ మ్యాచ్‌లో కోహ్లీ ఆట తీరుకు సోషల్ మీడియా ద్వారా దేశంలో ఉన్న క్రికెట్ అభిమానులు అందరూ కోహ్లీని పొగడ్తల వర్షంలో ముంచేత్తుతున్నారు. దీపావళికి ఇండియాకు అదిరిపోయే విజయాన్ని అందించారంటూ తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే వరల్డ్ కప్ ను కూడా సాధించాలని అందరూ కోరుకుంటున్నారు.

 

View this post on Instagram

 

A post shared by AnushkaSharma1588 (@anushkasharma)