బాలయ్య మంచితనానికి మరో నిదర్శనం ఇదే..!

నందమూరి బాలకృష్ణ ఒకవైపు సినిమాలలో మరొకవైపు రాజకీయాలలో బాగానే పాపులర్ సంపాదించారని చెప్పవచ్చు. ఈ పాపులర్ ద్వారా ఎంతో మంది అభిమానులు సంపాదించుకున్నారు. అలా ఇప్పుడు బాలయ్య అన్ స్టాపబుల్ షో వల్ల మరింత పాపులర్ అయ్యారని చెప్పవచ్చు. ఇక పలు సేవా కార్యక్రమాలలో కూడా నందమూరి బాలకృష్ణ చేస్తూ తన తండ్రికి తగ్గ తనయుడిగా పేరుపొందారు బాలకృష్ణ. ఇక ఇప్పటికే అన్ స్టాపబుల్ షో చేస్తూ ఆ డబ్బునంత పలు సేవా కార్యక్రమాలకు ఉపయోగిస్తున్నారనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి.

Basavatarakam Cancer Hospital Awarded as 6th Best Cancer Hospital in India  : Balakrishna - video Dailymotion
ఇప్పుడు తన కెరియర్ లో మొదటిసారి ఒక యాడ్లో నటించబోతున్నారు. బాలకృష్ణ ఆ డబ్బును కూడా పలు సేవ కార్యక్రమాలకి ఉపయోగించబోతున్నట్లు తెలుస్తోంది బాలయ్య ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ బ్రాండ్ అంబాసిడర్ గా కూడా వ్యవహరించబోతున్నారు. అందుకు సంబంధించి ఒక కమర్షియల్ షూటింగ్ను కూడా మొదలుపెట్టారు. బాలయ్య ఎప్పుడు ఈ యాడ్ రెమ్యూనరేషన్ కూడా తన తండ్రి నిర్మించిన బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ హాస్పిటల్ కి విరాళంగా ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లుగా సమాచారం.

దీంతో మరొకసారి బాలయ్య గొప్ప తనం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదంటూ అభిమానుల సైతం పలు రకాలుగా కామెంట్స్ చేస్తూ ఉన్నారు. ఇక బాలకృష్ణ సినిమాల విషయానికి వస్తే బాలకృష్ణ నటిస్తున్న 107వ చిత్రానికి వీరసింహారెడ్డి అనే టైటిల్ని పెట్టడం జరిగింది ఈ చిత్రంలో హీరోయిన్గా శృతిహాసన్ నటిస్తున్నది. ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో విడుదలకు సిద్ధంగా ఉన్నది. చివరిగా బాలకృష్ణ అఖండ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నారు. ఇక అదే ఊపుతో పలు సినిమాలను చేస్తూ సక్సెస్ హీరోగా పేరు పొందాలని ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు బాలకృష్ణ. ప్రస్తుతం బాలకృష్ణ కు సంబంధించి ఈ విషయం వైరల్ గా మారుతొంది.