నిన్న జరిగిన భారత్ -పాకిస్తాన్ మ్యాచ్‌లో చివరి వరకు వీరోచితంగా పోరాడి, భారత్ ను గెలిపించడంలో.. విరాట్ కోహ్లీ ముఖ్య పాత్ర పోషించాడు. భారత్ మ్యాచ్ గెలవడంతో విరాట్ కోహ్లీ పై సర్వాత్ర ప్రశంసలు వచ్చిపడుతున్నాయి. క్రికెట్ అభిమానుల నుండి ప్రత్యర్థులతో పాటు విమర్శకులు కూడా పొగడ్తల వర్షంలో మెచుకుంటున్నారు. ఇన్ని రోజులు బట్టి ఫామ్ లో లేడని తిట్టిన వాళ్ళందరూ.. ఇప్పుడు కోహ్లీని మెచ్చుకుంటున్నారు. ఐసీసీ తన ట్విట్టర్ ఖాతాలో.. కింగ్ ఇస్ బ్యాక్ అంటూ కింగ్‌లా కూర్చీపై కూర్చున్న ఒక ఫోటోను తన ట్విట్టర్లో పోస్ట్ చేసింది. పాకిస్తాన్ టీం కెప్టెన్ బాబర్ ఆజామ్ కూడా.. కోహ్లీని పొగడ్తలతో ముంచిత్తాడు. విమర్శించిన వారి మాటలు పట్టించుకోకుండా తనెంటో ఈ మ్యాచ్‌లో కోహ్లీ నిరూపించుకున్నాడు. తనను విమర్శించిన వారిని తన ఆటతీరుతో సమాధానం ఇచ్చాడు.
అయితే ఎప్పుడు స్టార్ స్పోర్ట్స్ తెలుగు అందరికంటే భిన్నంగా కోహ్లీని ప్రశంసించింది. ఇక టాలీవుడ్ నటసింహం నందమూరి బాలకృష్ణ తాజాగా నటిస్తున్న సినిమా వీర సింహారెడ్డి.. అయితే ఇప్పుడు స్టార్ స్పోర్ట్స్ ఈ సినిమా పోస్టర్‌ను ఎడిట్ చేసి బాలయ్య ఉన్న స్థానంలో కోహ్లీని పెట్టి.. కిలోమీటర్ రాయి మీద కింగ్ ఇస్ బ్యాక్ క్యాప్షన్ తో పాటు కోహ్లీ పాకిస్తాన్ పై అతడు చేసిన స్కోర్ ని ఆ రాయుపై మెన్షన్ చేసింది. వీటితో పాటు.. సినిమా పేరు కు తగ్గట్టుకు విరాట్ కోహ్లీ పేరును కూడా విరాట్ సింహ కోహ్లీగాా మార్చేసింది.
ఈ ఫోటో కింద ఒక డైలాగ్ ని కూడా రాస్కొచ్చింది..” చేజింగ్ లో ఓడిపోవడం నా బయోడేటా లోనే లేదు” అనే డైలాగు పెట్టి చూసే వారికి కోహ్లీకి బాలయ్య పూనాడా అనే విధంగా ఆ పోస్టర్‌ను స్టార్ స్పోర్ట్స్ తెలుగు ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసింది. పోస్ట్ షేర్ చేసిన వెంటనే సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో ట్రెండ్‌గా నడుస్తుంది.
“చేజింగ్ లో ఓడిపోవడం నా బయోడేటా లోనే లేదు!” – విరాట్ సింహ కోహ్లీ! 😎👊🏻#ViratKohli #KingKohli #NBK107 #VeeraSimhaReddy #JaiBalayya #TeamIndia #IndianCricketTeam#BelieveInBlue 💙 pic.twitter.com/3CxUTWk5tl
— StarSportsTelugu (@StarSportsTel) October 23, 2022