సాయికుమార్ కష్టాలు తెలిస్తే కన్నీళ్ళాగవు..!

తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా ఎదిగిన ప్రతి ఒక్కరు జీవితం వెనుక ఎన్నో కథలు ఉంటాయి. సినీ ఇండస్ట్రీలో కూడా కష్టపడకుండానే స్టార్డం వచ్చిన వారు చాలా తక్కువ మంది ఉంటారని చెప్పవచ్చు. ఇక ఒకప్పుడు విలక్షణమైన హీరోగా పేరు పొందిన సాయికుమార్ హీరోగా ఎంట్రీ అంత సులువుగా జరగలేదట. తన జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నానని తెలియజేశారు. వాటి గురించి ఇప్పుడు పూర్తి వివరాలు తెలుసుకుందాం.

సాయి కుమార్ కుటుంబం తో సహా ఆత్మహత్య ఎందుకు చేసుకోవాలనుకున్నారు..ఆపింది ఎవరు  ..

సాయికుమార్ కాలేజీలో చదువుకుంటున్న రోజుల్లో తన తండ్రి చెప్పిన మాటలు పదేపదే గుర్తుకు వచ్చేవట. అలా ఎన్నోసార్లు తనని దీర్ఘ ఆలోచనల పడి వేశాయని తెలియజేశారు. తను కొన్నిసార్లు మంచినీళ్లు తాగి పుస్తకాలు చదువుకున్న రోజులు ఉన్నాయని తెలిపారు. ఒకరోజు కాలేజ్ నుంచి ఇంటికి తిరిగి వచ్చాక ఆకలి వేస్తోందని వంట గదిలోకి వెళ్ళగా అక్కడ కేవలం ఒక్క మనిషికి మాత్రమే సరిపడే అన్నం ఉందని తెలియజేశారు. అయితే అది తిన్న తర్వాత బయట కూర్చున్న సాయికుమార్ కు తన తండ్రి మంచం మీద నిద్రిస్తున్నారట.

Sai Kumar's Daughter Jyothirmayi Family Photos - Lovely Telugu

అయితే అలా నిద్ర రాక కదులుతున్న సాయికుమార్ తండ్రి శర్మాను చూసి తన భార్య కృష్ణ జ్యోతి కాస్త తిని పడుకోమంటే వినలేదు ఇప్పుడు చూడండి నిద్ర పట్టక ఇబ్బంది పడుతున్నారు అని తెలియజేసిందట. ఈ మాటలు విన్న సాయికుమార్ ఒక్కసారిగా కంట్లో నీరు వచ్చాయట.కానీ ఆ మాటలకు తన తండ్రి శర్మ నేను తిని పడుకుంటే సాయి ఏం తింటారు అని వాడు ఆకలితో పడుకుంటే నేనెలాగా తినగలను అని చెప్పారట. ఈ విషయం సాయికుమార్ ను బాగా కలిచి వేసిందని తెలియజేశారు. అందుచేతనే ఇప్పటికీ అన్నాన్ని చుస్తే తన తల్లితండ్రులే గుర్తుకు వస్తారని తెలియజేశారు. అంతేకాకుండా మొదట రూ.250 రూపాయలతో రేడియోలో వాయిస్ చెప్పడం ని మొదలుపెట్టారు. ఇలా ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని హీరోగా ఎదిగానని తెలిపారు సాయికుమార్.