బింబిసారా సినిమా ఎన్ని కోట్లు లాభం వచ్చిందో తెలుసా..?

నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన చిత్రం బింబిసార. ఈ సినిమా కళ్యాణ్ రామ్ కెరియర్ లోనే అత్యధిక భారీ బడ్జెట్ తో తెరకెక్కించారు ఈ చిత్రం కూడా టైం ట్రావెల్ కథ అంశంతో తెరకెక్కించడం జరిగింది. ఇందులో హీరోయిన్లుగా సంయుక్త మీనన్, కేథరిన్ హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాని డైరెక్టర్ మల్లిడి వశిష్ట ఎంతో అద్భుతంగా తెరకెక్కించాలని చెప్పవచ్చు. ఇక ఈ సినిమాని ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై కళ్యాణ్ రామ్ నిర్మించడం జరిగింది. ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, ట్రైలర్ ఈ సినిమాకు మంచి పాజిటివ్ బజ్ ను ఏర్పడుతుంది. ఇక దీంతో ఈ సినిమా తగ్గట్టుగానే పాజిటివ్ టాక్ రావడంతో కలెక్షన్ కూడా భారీగానే వసూలు చేసింది. చివరిగా ఈ సినిమా క్లోజింగ్ కలెక్షన్ల విషయానికి వస్తే..

Bimbisara on OTT: Where to watch Nandamuri Kalyan Ram's film, Subscription,  Cast, Review, Trailer | Ott News – India TV

1). నైజాం-11.83 కోట్ల రూపాయలు.
2). సిడెడ్-8.8 కోట్ల రూపాయలు.
3). ఉత్తరాంధ్ర-4.89 కోట్ల రూపాయలు.
4). ఈస్ట్-2.1 కోట్ల రూపాయలు.
5). వెస్ట్-1.50 కోట్ల రూపాయలు.
6). గుంటూరు-2.28కోట్ల రూపాయలు
7). కృష్ణ-1.63 కోట్ల రూపాయలు.
8). నెల్లూరు- 96 లక్షలు.
9). ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మొత్తం కలెక్షన్ల విషయానికి వస్తే.. రూ.33.18 కోట్ల రూపాయలు రాబట్టింది.
10). రెస్ట్ ఆఫ్ ఇండియా-2.34 కోట్ల రూపాయలు.
11). ఓవర్సీస్-2.40 కోట్ల రూపాయలు.
12). ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల విషయానికి వస్తే రూ. 37.92 కోట్ల రూపాయలు రాబట్టింది.

బింబిసార సినిమా థియేట్రికల్ బిజినెస్ విషయానికి వస్తే.. రూ.15.5 కోట్ల రూపాయలు జరగగా.. ఇక ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించాలి అంటే కచ్చితంగా 16 కోట్ల రూపాయలు రాబట్టాల్సి ఉన్నది అయితే ఈ సినిమా ముగిసే సమయానికి రూ.37.92 కోట్ల రూపాయలను సాధించింది. ఓవరాల్ గా ఈ చిత్రం బయ్యర్లకు రూ.21.92 కోట్ల లాభాన్ని అందించింది.