సునీల్ కెరీర్ నాశనం అవ్వడానికి కారణం తరుణ్ నే..నిలువునా ముంచేసాడట..!?

సినిమా ఇండస్ట్రీలో ఎవరి జాతకాలు ఎప్పుడు మారిపోతాయో ఎవరు చెప్పలేరు. స్టార్ గా ఉన్న హీరో అవ్వడం.. జీరో గా ఉన్న కమెడియన్ స్టార్ గా అవడం క్షణాల్లో జరిగిపోతాయి. పాపం అలాంటి మాయలకే బలైపోయాడు సినీ ఇండస్ట్రీలో కమెడియన్ గా అడుగుపెట్టిన సునీల్ . ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తనదైన స్టైల్ లో కామెడీ పంచులతో నవ్విస్తూ స్టార్ హీరోలకు మించిన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న స్టార్ కమెడియన్ నే ఈ సునీల్.

“నువ్వే కావాలి” అనే సినిమా ద్వారా సినీ ఇండస్ట్రీలోకి కమెడియన్ ఎంటర్ అయ్యి.. ఆ తర్వాత బోలెడన్ని సినిమాల్లో నటించి తనదైన స్టైల్ లో కామెడీని పండిస్తూ జనాలను కడుపుబ్బ నవ్వించాడు . అంతేకాదు ఒకానొక టైంలో ఆ సినిమాలో సునీల్ ఉంటే సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవుద్ది అంటూ జనాలు చెప్పుకునే అంత స్థాయికి ఎదిగిపోయాడు . అంతలా తన కామెడీతో నవ్వుల పంచులు వేస్తు నవ్విస్తూ జనాలకు దగ్గరైయ్యాడు.

అయితే టాలీవుడ్ హీరో తరుణ్ చెప్పిన మాటలు కారణంగా ఆయన కమెడియన్ నుంచి హీరోగా మారి తన జీవితాన్ని నాశనం చేసుకున్నాడు అన్న కామెంట్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి . మనకు తెలిసిందే సినీ ఇండస్ట్రీలో సునీల్ తరుణ్ మంచి ఫ్రెండ్స్. తరుణ్ హీరోగా నటించిన ఆల్మోస్ట్ ఆల్ అన్ని సినిమాలలోను సునీల్ కనిపిస్తాడు. అంత మంచి ఫ్రెండ్షిప్ వాళ్ళిద్దరి మధ్య ఉంది .అంతే కాదు మంచి బాండింగ్ కూడా ఏర్పరచుకున్నారు .

ఈ క్రమంలోనే తరుణ్ ..”నీకు హీరో అయ్యే క్వాలిటీస్ బాగున్నాయి. డాన్స్ కూడా బాగా వేస్తావు కొంచెం ట్రై చెయ్ ..కమెడియన్గా ఎందుకు.. హీరోగా ట్రై చేయండి.. హీరోకి ఉన్న వాల్యూ కమెడియన్ కి ఉండదు “అంటూ ఆయనను మార్చి కమెడియన్ గా ఉండాలి అనుకున్న సునీల్ ని హీరోగా ట్రై చేసేలా చేసి.. అటు కమెడియన్ గా ఇటు హీరోగా రెండు అవకాశాలు లేకుండా ఫ్లాప్ ఆర్టిస్ట్ గా మార్చేశాడు తరుణ్. తెలిసి చేశాడో తెలియక చేసాడో తెలియదు కానీ .. పరోక్షంగా సునీల్ కెరియర్ నాశనం అవ్వడానికి కారణం మాత్రం తరుణ్ కారణమయ్యాడు అంటున్నారు సునీల్ అభిమానులు.