ఈ విలన్ భార్య లో ఉన్న స్పెషల్ టాలెంట్ తెలిస్తే..ఆశ్చర్యపోవాల్సిందే..!!

సినిమా ఇండస్ట్రీలో హీరోలకు ఎంత క్రేజ్ ఉంటుందో.. విలన్ గా నటించే నటులకు అంతే క్రేజ్ ఉంటుంది. ఒక సినిమాకి హీరో మ్యానరిజం ఎంత ముఖ్యమో.. ఆ సినిమాకి విలన్ విలనిజం కూడా అంతే ముఖ్యం. అయితే అలాంటి పాత్రలు అందరు చేసి మెప్పించలేరు. కానీ ఎలాంటి విలన్ పాత్రనైనా సరే తనదైన స్టైల్లో నటించి మెప్పించగల నటుడు ఈ అజయ్. దాదాపు రెండు దశాబ్దాలుగా సినీ ఇండస్ట్రీలో ఉంటూ స్టార్ హీరోల సినిమాలో ప్రధాన పాత్రులు పోషిస్తూ ఓవైపు సాఫ్ట్ క్యారెక్టర్ ఆర్టిస్టు పాత్రలు చేస్తూ ..మరోవైపు రూట్ విలన్ గా నటిస్తూ తనదైన స్టైల్ లో అభిమానులను సంపాదించుకున్నాడు ఈ అజయ్ .

విక్రమార్కుడు, సై, ఒక్కడు, దూకుడు, గబ్బర్ సింగ్, అ ఆ , సరిలేరు నీకెవ్వరు, అలా వైకుంఠపురంలో, భీష్మ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలలో నటించాడు అజయ్. అయితే ఈయనకు క్రేజ్ తీసుకొచ్చిన సినిమా ఏది అంటే చత్రపతి,ఆర్య 2 సినిమా లు. ఈయనని జనాలకు దగ్గర అయ్యేలా చేసాయి. అయితే సినిమాల పరంగా జనాలకు తెలిసిన అజయ్ వ్యక్తిగత జీవితం గురించి చాలా తక్కువ మందికే తెలుసు. ఆయన భార్య పేరు శ్వేతా రావూరి.

ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈయనకు భార్య అంటే మహా ఇష్టం. అంతేకాదు శ్వేత ఓ ఫ్యాషన్ డిజైనర్ . మిస్ ఇండియా పోటీలలో ఫైనల్ పోటీ దారిని అని కూడా తెలుస్తుంది. అంతేనా అజయ్ భార్యకు అన్ని విషయాల్లో సపోర్ట్ చేస్తాడట. మరీ ముఖ్యంగా శ్వేతాలో ఉన్న స్పెషల్ టాలెంట్ ఏంటంటే.. ఎలాంటి డ్రెస్ నైనా సరే కేవలం 10 నిమిషాల్లో డిజైన్ చేసి ఇచ్చేస్తుందట . అందుకే మన స్టార్ హీరో భార్యలు కూడా ఈమె దగ్గర డ్రెస్సెస్ డిజైన్ చేయించుకుంటారని తెలుస్తుంది . ఎలాంటి డ్రెస్ నైనా ఇట్టే డ్రాయింగ్ వేసేసి వాళ్లకు తగ్గ నచ్చే విధంగా డిజైన్ చేయిస్తుందట / ఆ విషయంలో శ్వేతా రావూరి తర్వాత ఎవరైనా అంటారు . వీరిద్దరికీ ఇద్దరు కొడుకులు. ఇద్దరు పిల్లలతో శ్వేతాతో ఫ్యామిలీ లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నాడు అజయ్.