బిగ్ షాకింగ్: విడాకులు తీసుకోబోతున్న రకుల్ ప్రీత్ సింగ్ పేరంట్స్..కారణం అదేనా..!?

ఈ మధ్యకాలంలో సినీ ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపిస్తున్న పదం విడాకులు. అదేంటో తెలియదు కానీ చిన్నపిల్లలు అలిగి గొడవపడి నువ్వు నా ఫ్రెండ్ కాదు అన్నంత ఈజీగా.. భార్య భర్తలు నీకు నాకు ఏ సంబంధం లేదు.. లెట్స్ బ్రేకప్ ..అప్లై ఫర్ డివర్స్ అంటూ సంచలన నిర్ణయాలు తీసుకుంటూ పవిత్రమైన పెళ్లి బంధాన్ని చులకనగా చూస్తున్నారు.

ఇప్పటికే సినీ ఇండస్ట్రీలో చాలామంది స్టార్ దంపతులు విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. మరీ ముఖ్యంగా సమంత-నాగచైతన్య, ధనుష్-ఐశ్వర్య, చిరంజీవి చిన్న కూతురు శ్రీజ- హీరో కళ్యాణ్ దేవ్.. విడాకులు కు సంబంధించిన మ్యాటర్లు బాగా వైరల్ అయ్యాయి. కాగా ఇదే క్రమంలో సినిమా ఇండస్ట్రీలోని స్టార్ హీరోయిన్గా ఉన్న రకుల్ ప్రీత్ సింగ్ పేరెంట్స్ విడాకులు తీసుకోబోతున్నారు అంటూ బాలీవుడ్ లో సంచలన వార్త బయటకు వచ్చింది.

బాలీవుడ్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం స్టార్ హీరోయిన్గా ఉన్న రకుల్ ప్రీత్ సింగ్ తల్లిదండ్రులు విడాకులు తీసుకొని వేరువేరుగా బ్రతకడానికి నిర్ణయించుకున్నారట. ప్రజెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో సంచలనంగా మారింది . రకుల్ ప్రీత్ సింగ్ నాన్నగారు రాజేంద్ర సింగ్ ..అమ్మగారు కుల్విందర్ సింగ్ ఎంత అన్యోన్యంగా ఉంటారో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. చాలా సినిమా షూటింగుల్లో.. సినిమా ఈవెంట్లలో రకుల్ ప్రీత్ సింగ్ వాళ్ళిద్దరిని జనాలకు పరిచయం చేసింది . కాగా గత కొంతకాలంగా ఇద్దరి మధ్య భేదాభిప్రాయాలు ఉన్నాయని రకుల్ ప్రీత్ సింగ్ కోసం కలిసి ఉంటున్నారని ఇదే క్రమంలో వీళ్లిద్దరి మధ్య గొడవ ముదిరి.. విడాకులు తీసుకొని ఎవరి లైఫ్ వాళ్ళ బ్రతకాలని నిర్ణయించుకున్నారని బాలీవుడ్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే దీనిపై ఇప్పటివరకు రకుల్ ప్రీత్ సింగ్ కానీ వాళ్ళ అమ్మానాన్న కానీ ఎటువంటి అఫీషియల్ ప్రకటన చేయలేదు. మరి చూడాలి ఈ వార్తపై రకుల్ ఎలా స్పందిస్తుందో..?