న‌వీన్ చంద్ర శాడిస్ట్ బిహేవియ‌ర్‌కు క‌ల‌ర్స్ స్వాతి షాక్‌.. హీరోకి వార్నింగ్‌!

కలర్స్ స్వాతి గురించి ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయవలసిన అవసరం లేదు. క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ తెరకెక్కించిన `డేంజర్` సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ `ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే` సినిమాలో త్రిష చెల్లిలి పాత్ర పోషించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక ఆ తరువాత అష్టా చమ్మా, గోల్కొండ హై స్కూల్, స్వామి రారా, కార్తికేయ, సుబ్రహ్మణ్యపురం, త్రిపుర వంటి పలు సినిమాలలో నటించి తన అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.

 

అయితే సినిమా కెరీర్ మంచి పిక్స్ లో ఉండగానే వైవాహిక బంధం లోకి అడుగుపెట్టి సినిమాలకు గ్యాప్ ఇచ్చింది. ఇటీవల స్వాతి సెకండ్ ఇన్నింగ్స్ లో వరుస సినిమాలతో దూసుకుపోతుంది. ప్రస్తుతం స్వాతి నవీన్ చంద్ర సరసన `మంత్ ఆఫ్ మధు` సినిమా అలాగే `పంచతంత్ర` సినిమాలో కూడా హీరోయిన్గా నటిస్తుంది. ఆమె తాజాగా నవీన్ చంద్ర గురించి కొన్ని షాకింగ్ కామెంట్స్ చేయడం సోష‌ల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం నవీన్ చంద్ర వరస సినిమాలతో బిజీ నటుడిగా మారాడు. ఈయన హీరో గానే కాకుండా కథను బట్టి విలన్ గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా చేస్తున్నాడు.

అయితే `అమ్ము` అనే సినిమాతో నవీన్ చంద్ర ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అమెజాన్ ప్రైమ్ లో డైరెక్ట్ గా రిలీజ్ అయ్యే ఈ సినిమా ప్రీమియర్ కు కలర్స్ స్వాతి హాజరైంది. నవీన్ చంద్ర ఈ సినిమాలో ఒక శాడిస్ట్ భర్త క్యారెక్టర్ ను పోషించాడు. ఈ సినిమా చూసిన స్వాతి మాట్లాడుతూ.. నవీన్ టాలీవుడ్ కు దొరికిన ఒక ముత్యం లాంటివాడు. అతడు ఏ సినిమాలో నటించిన ఆ క్యారెక్టర్ కు తగిన న్యాయం చేస్తాడు అంటూ చెప్పుకొచ్చింది.

`అమ్ము` సినిమాలో నవీన్ చంద్ర శాడిస్ట్ భర్తగా తన పాత్రలో జీవించేసాడు. సినిమా మధ్యలో నవీన్ నా దగ్గరకు రాగా.. ఆ సమయంలో నవీన్ చంద్ర శాడిస్ట్ బిహేవియర్ ని చూసి షాక్ అయ్యాను.. `ఇక్కడి నుంచి వెళ్ళిపో అని` వార్నింగ్ ఇచ్చాను అని ఇంట్రెస్టింగ్ విషయం చెప్పుకొచ్చింది. అంతలా ఆ క్యారెక్టర్ కు నేను కనెక్ట్ అయ్యాను అంటూ సినిమా చాలా బాగుంది.. అని కలర్ స్వాతి కాంప్లిమెంట్ ఇచ్చింది. ఇక ప్రస్తుతం నవీన్ చంద్ర పై కలర్ స్వాతి చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.