బాలకృష్ణ ‘వీరసింహారెడ్డి’… సినిమా నుండి ఎవరు ఊహించిన అప్డేట్..!

బాలకృష్ణ 107వ సినిమాని స్టార్ దర్శకుడు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. అక్టోబర్ 21న ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ ను కర్నూలులో ప్రత్యేకంగా కొండారెడ్డి బురుజు దగ్గర ప్రకటించారు. ఈ సినిమాకి ‘వీర సింహారెడ్డి’ అనే పేరును లాక్ చేశారు.
ఈ సినిమాను 2023 సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నారు. ఈ సినిమా నుంచి ఎవరు ఊహించిన అప్డేట్ బయటకు వచ్చింది. అప్డేట్ ఏంటంటే ఈ సినిమాలో 11 ఫైట్లు ఉంటాయని వార్తలు వినిపిస్తున్నాయి.

Nandamuri Balakrishna, Gopichand Malineni, Mythri Movie Makers #NBK107  Titled Veera Simha Reddy, Releasing For Sankranthi 2023 -  www.mykollywood.com

బాలకృష్ణ పుట్టిన‌రోజు కానుకగా విడుద‌లైన‌ అయిన టీజర్- ఫస్ట్ లుక్ లకు అభిమానుల నుంచి భారీ స్థాయిలో స్పందన వచ్చింది. అఖండ ఎలాంటి సూపర్ హిట్ తరవాత వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. టీజర్ కు మంచి రెస్పాన్స్ రావడంతో ప్రేక్షకులలో మంచి బజ్ క్రియేట్ చేసుకుంది. ఇక ఈ సినిమా ట్రైలర్‌ను నవంబర్‌లో విడుదల చేస్తున్నట్లు ఈ సినిమా యూనిట్ వెల్లడించింది.

Veera Simha Reddy Cast, Release Date, Trailer, Posters - Chitrambhalare

బాలకృష్ణ అఖండ లాంటి మరో భారీ యాక్షన్ ఎంటర్టైనర్ తో రాబోతున్నాడు. ఈ సినిమాలో బాలయ్యకు జోడిగా అందాల భామ శృతిహాసన్ నటిస్తుంది. వరలక్ష్మి శరత్ కుమార్- దునియా విజయ్ ఈ సినిమాలో కీలక కీలక పాత్రలో కనిపించనున్నారు. మైత్రి మూవీ మేకర్స్ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు థ‌మన్ సంగీతం అందిస్తున్నాడు.