Birthday: ప్రభాస్ గురించి తెలియని కొన్ని విషయాలు ఇవే..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగిన స్టార్ హీరోలలో ప్రభాస్ కూడా ఒకరు. ప్రభాస్ తన సినీ కెరియర్ లో ఇప్పటివరకు ఎన్నో బ్లాక్ బాస్టర్ చిత్రాలలో నటించారు. ఈరోజు ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ప్రభాస్ అభిమానులు పుట్టినరోజు వేడుకలను చాలా ఘనంగా చేస్తున్నారు. ఇక ప్రభాస్ గురించి తెలియని పలు విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం.

Prabhas Net Worth 2022: Salary, Assets, Income, Biography
ప్రభాస్ హీరో కాకపోతే తన ఏదైనా స్టార్ హోటల్ నిర్మించి వాటిని మెయింటైన్ చేయాలనుకునే వారట. ప్రభాస్ అసలు పేరు వెంకట సత్యనారాయణ ప్రభాస్ రాజు ఉప్పలపాటి. ఇక తన విద్యాభ్యాసాన్ని మొత్తం హైదరాబాదులోని పూర్తి చేశారు. ప్రభాస్ సొంత ఊరు మొగల్తూరు. అనుకోని విధంగా సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి ప్రస్తుతం ప్రభాస్ స్టార్ హీరోగా మారిపోయారు ప్రభాస్ కెరియర్లో మలుపు తిప్పిన చిత్రం వర్షం. ఈ చిత్రం ప్రభాస్ లో సరికొత్త గా కనిపించారు ఇక తర్వాత చత్రపతి సినిమాతో స్టార్ హీరోగా మారిపోయారు.

ప్రభాస్ కెరియర్ లో బాహుబలి చిత్రం ఒక మైలురాయని చెప్పవచ్చు. ఈ సినిమా కోసం దాదాపుగా నాలుగు సంవత్సరాల పాటు తన డేట్ లను కేటాయించారు. ఈ సినిమా షూటింగ్ సమయంలో తన దగ్గరకు ఎన్నో కథలు వచ్చినా కూడా వాటన్నిటిని రిజెక్ట్ చేశారట ప్రభాస్. దీంతో దాదాపుగా 30 కోట్ల రూపాయల వరకు నష్టం వచ్చిందట. ప్రభాస్ అయినా కూడా కేవలం ప్రభాస్ తన ఫోకస్ మొత్తం బాహుబలి సినిమా పైనే పెట్టారు. ప్రభాస్ కు ఇష్టమైన చిత్రాలు రాజ్ కుమార్ హిరాని చిత్రాలు అంటే చాలా ఇష్టమట. ప్రభాస్ బాహుబలి సినిమా రాయల్ ఆల్బర్ట్ హాలులో ప్రదర్శించబడిన ఏకైక ఆంగ్లేతర చిత్రంగా ప్రసిద్ధి చెందింది.అంతేకాకుండా ప్రపంచ ప్రఖ్యాత మైనపు మ్యూజియం బొమ్మను కలిగిన మొదటి దక్షిణాది భారతీయ నటుడిగా ప్రభాస్ పేరు సాధించడం విశేషం. ప్రభుదేవా నటించిన బాలీవుడ్ చిత్రం యాక్షన్ జాక్సన్ లో ప్రభాస్ అతిథి పాత్రలో ఎంట్రీ ఇచ్చారు. హాలీవుడ్ నటుడు లెజెండ్ రాబర్ట్ నీరో ప్రభాస్ కు ఫేవరెట్ హీరో.