అషు రెడ్డి హాట్ ఫోటో షూట్.. ఘాటైన అందచందాల ఆరబోత!

డూప్లికేట్ సమంత అషు రెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గ్లామర్ ట్రీట్ ఇవ్వడంతో ఈ అమ్మడు హీరోయిన్ సమంతను కూడా మించిపోతుంది. ఆన్ లైన్ మాధ్యమాలను షేక్ చేయడమే లక్ష్యంగా ఫోటో షూట్స్ తో తెలుగు కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తోంది. కెమెరా ముందు తన బాడీని డిఫరెంట్ యాంగిల్స్ లో ప్రాజెక్ట్ చేస్తూ కనువిందు చేస్తోంది ఈ బిగ్ బాస్ సుందరి. ఫారెన్లో బ్యూటిఫుల్ లొకేషన్స్ కి వెళ్ళినపుడు అషు మరీ రెచ్చిపోయి ఫోటోలు దిగుతుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈఫిల్ టవర్ ముందు నిల్చొని హాట్ గేర్ వేసింది అషు రెడ్డి.

ఈఫిల్ టవర్ వెనుకభాగంలో కనిపించేలా ఓ బంగ్లాపై నిల్చొని కెమెరాకు తనపంధాలో ఫోజులిచ్చింది. బ్యాక్ లెస్ డ్రెస్ వేసుకొని అందాలను చూపిస్తూ, తన ఎద లోతుల్లో దాగి ఉన్న టాటూను బయటకి చూపిస్తూ కుర్రకారుని ఊరిస్తోంది. దీంతో ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అప్పట్లో రామ్ గోపాల్ వర్మతో బోల్డ్ ఇంటర్వ్యూలో పాల్గొని శృంగార పరమైన ప్రశ్నలకు ధీటుగా సమాధానాలు చెప్పిన అషు వాటిని ఈ ఫొటోలతో పునరావృతం చేసేలా చేసింది. డిఫరెంట్ టైపు పోజులతో స్టార్ హీరోయిన్స్ ని తలదన్నేలా అట్రాక్ట్ చేస్తోంది అషు రెడ్డి.

కాగా ఈమె చేసిన ప్రతి ఫోటో షూట్ కూడా సోషల్ మీడియాను క్షణాల్లో షేక్ చేయడం కొసమెరుపు. తనదైన కట్టు బొట్టుతో జూనియర్ సమంతగా జనాల్లో ఓ పేరు తెచ్చుకున్న అషు రెడ్డి, రాబోయే రోజుల్లో సమంతానే మించిపోయేలా వుంది అని నెట్టింట జనాలు దిష్టి పెడుతున్నారు. సోషల్ మీడియాలో గ్లామర్ డోస్ పెంచేస్తూ ఫాలోయింగ్ రెట్టింపు చేసుకొనే పనిలో పడింది. ఇకపోతే అందరిలాగే అషు రెడ్డికి ట్రోలింగ్ అనుభవం కూడా ఉంది. గతంలో ఎన్నోసార్లు ఇలా డిఫరెంట్ పోజులు వదిలి ట్రోల్స్ బారిన పడింది. కానీ ఎంతైనా వర్మ వారసురాలు కదా. అవేమి పట్టించుకోకుండా మరింత రెచ్చిపోయి ట్రోలర్స్ కి కుళ్ళు కలిగిస్తోంది.

Share post:

Latest