BiggBoss షో ద్వారా RJ సూర్య ఎంత సంపాదించాడో తెలిస్తే షాక్ అవుతారు!

RJ సూర్య పేరు ఇపుడు తెలుగు రాష్ట్రాలలో బాగా వినబడుతోంది. దానికి కారణం వేరే చెప్పాల్సిన పనిలేదు. తెలుగులో ప్రస్తుతం బిగ్ బాస్ ఆరవ సీజన్ కొనసాగుతోంది. తెలుగులో ఈ షో అత్యధిక రేటింగ్స్ సొంతం చేసుకుంటూ దేశంలోనే నెంబర్ వన్ షోగా గుర్తింపు సాధించింది. ఆరవ సీజన్లో భాగంగా ఎనిమిదవ వారానికి సంబంధించి స్ట్రాంగ్ కంటెస్టెంట్ అనిపించుకున్న RJ సూర్య తాజగా ఎలిమినేట్ అయిన విషయం మీ అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలోనే అతడు ఈ సీజన్ కోసం ఎంత పారితోషకం తీసుకున్నాడు అనే విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

అవును, బిగ్ బాస్ ఆరో సీజన్లోకి రికార్డు స్థాయిలో ఏకంగా 21 మంది సెలబ్రిటీలు కంటెస్టెంట్ లుగా వెళ్లగా వీరంతా తమ తమ స్కిల్స్ తో ఎనలేని క్రేజ్ ను తెలుగునాట సంపాదించుకున్నారు. అయితే అందులో కొంతమంది ప్రత్యేక దృష్టిని ఆకర్శించారు. వారిలో ఫేమస్ ఆర్ జె, మిమిక్రీ ఆర్టిస్ట్ అయిన సూర్య ఒకడు. ఆరంభంలోనే తనదైన టాలెంట్ తో మెప్పించిన సూర్య ఖచ్చితంగా టాప్ ఫైవ్ కంటెస్టెంట్ గా గుర్తింపు తెచ్చుకుంటాడు అని అందరూ అనుకున్నారు. అయితే ఈయన చేసిన కొన్ని పనుల వల్ల బిగ్ బాస్ ఎలిమినేట్ చేశాడు.

మొదట్లో పెద్దగా ఎవరితో కూడా గొడవలు పడకుండా ఇచ్చే టాస్కుల్లో ఎంతో యాక్టివ్ గా పాల్గొనేవాడు. అందుకే ఆర్జే సూర్యను అందరూ చాలా సైలెంట్ పెర్సన్ అని పిలిచేవారు. ఈ క్రమంలోనే భారీ స్థాయిలో ప్రేక్షకుల నుంచి మద్దతు కూడా చేకురున్ది. అయితే ఈ క్రమంలో అతగాడు చేసిన కొన్ని సిల్లీ మిస్టేక్స్ పూర్తిగా దెబ్బతీసాయని అంటున్నారు. మొదట్లో ఆరోహితో ప్రేమాయణం ట్రై చేసి దెబ్బ తిన్నాడు. ఇక ఆమె బయటకు వెళ్ళగానే ఇనయా సుల్తానాకి లైన్ వేసాడు. ఈ క్రమంలో వీరిద్దరి రొమాన్స్ తట్టుకోలేక షో నుంచి బయటకు పంపించేశారు. అసలు విషయానికొస్తే, 8 వారాలపాటు హౌస్ లో ఉన్న ఆర్జే సూర్య రోజుకు రూ.27 వేల చొప్పున వారానికి రూ.1.89 లక్షలు, తద్వారా 8 వారాలపాటు ఉన్నందుకుగాను రూ.15.12 లక్షలు పారితోషకం తీసుకున్నట్లు వినికిడి.