వావ్: బాలయ్య నెక్స్ట్ సినిమా ఆయనతోనే.. ఇక దబిడిదిబిడే..!!

టాలీవుడ్ సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . తనదైన స్టైల్ లో సినిమాలు చేస్తూ యంగ్ హీరోలకు సైతం ధీటుగా కాంపిటీషన్ ఇస్తున్నాడు. గతేడాది అఖండతో బాక్సాఫీస్ కు బ్లాక్ బస్టర్ హిట్ ను అందించిన బాలయ్య..ప్రజెంట్ గోపీచంద్ మలినేని డైరెక్షన్లో “వీరసింహారెడ్డి” అనే సినిమాను చేస్తున్నారు. ప్రస్తుతం చివరి షెడ్యూల్ షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా రిలీజ్ కాబోతుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లును పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నారు మేకర్స్.

ఈ సినిమా పూర్తి అవ్వగానే బాలకృష్ణ టాలెంటెడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తో మరో సినిమా కి కమిట్ అయ్యాడు . అందుతున్న సమాచారం ప్రకారం జనవరి మొదటి వారంలో ఈ సినిమా షూట్ మొదలుపెట్టి ..ఎవరు ఊహించిన విధంగా కేవలం నాలుగు నెలల్లోనే షూట్ ఫినిష్ చేసి ..మరో క్రేజీ దర్శకుడు తో సినిమాకు కమిట్ అయ్యే ఆలోచనలో ఉన్నాడట ఈ నటి సింహం .

“సర్కారి వారి పాట”తో బ్లాక్ బస్టర్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్న పరశురాం డైరెక్షన్లో బాలయ్య ఓ సినిమా చేయబోతున్నాడు అంటూ న్యూస్ వైరల్ గా గా మారింది. ఆదివారం జరిగిన ఊర్వశివో రాక్షసివో మూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో ముఖ్యఅతిథిగా బాలకృష్ణతో పాటు దర్శకుడు పరశురామ్ కూడా పాల్గొన్నారు . ఆయన మాట్లాడుతు..” త్వరలోనే అద్దిరిపోయే కధతో బాలయ్యను మీట్ అవ్వబోతున్నా”అంటూ చెప్పుకొచ్చారు. ఈ క్రమంలోనే బాలయ్య తో పరశురాం సినిమా ఉండబోతుంది అంటూ న్యూస్ వైరల్ గా మారింది . ఏది ఏమైనా సరే పరశురాం లాంటి డైరెక్టర్ డైరెక్షన్లో బాలకృష్ణ నటన చూస్తే ఫుల్ దబిడి దిబిడే అంటూ ఫ్యాన్స్ పూనకాలు వచ్చినట్లు ఊగిపోతున్నారు.