మీ బెడ్ రూమ్ లో ఇలా జరిగితే ఊరుకుంటారా..? పర్సనల్ వీడియో లీక్ పై కోహ్లీ ఆగ్రహం..!!

ఇండియన్ స్టార్ క్రికెట్ ప్లేయర్ విరాట్ కోహ్లీ పర్సనల్ రూమ్ వీడియో నెట్టింట వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. ఆ హోటల్ రూమ్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్ లో దూసుకుపోతుంది. ఆయన గదిలో లేనప్పుడు హోటల్ కి సంబంధించిన సిబ్బంది ఎవరో ఆయన రూమ్ ని సీక్రెట్ గా వీడియో తీసి సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు. దీంతోతో ఒక్కసారిగా షాక్ అయిపోయిన ఫాన్స్, విరాట్ కోహ్లీ , ఆయన భార్య అనుష్క శర్మ ..ఈ లీక్డ్ వీడియో పై మండిపడ్డారు .

అంతేకాదు తమదైన స్టైల్ లెఫ్ట్ అండ్ రైట్ ఇస్తూ సూటిగా ఇచ్చిపడేసారు. ఈ వీడియో పై విరాట్ కోహ్లీ స్పందిస్తూ..” ఇట్స్ రియల్లీ షాకింగ్ ..నా గదిలో నేను లేకుండా.. నా పర్సనల్ థింగ్స్ ని మీకు ఎలా చూపిస్తారు . నా పర్మిషన్ లేకుండా ఇలా చేయడం తప్పు. ఇది నాకు సేఫ్టీ లేనట్టే.. నా స్వేచ్ఛకు భంగం కలిగించే ఈ అభిమానం నాకు వద్దు. ఈ ఉన్మాదపు అభిమానం ..వినోదం కోసం ఆటగాళ్లను వస్తువుగా చూసే ఈ చెత్త ఫ్యాన్ ఫాలోయింగ్ నాకు వద్దనే వద్దు ..నాకు కొంచెం ప్రైవసీ ఇవ్వండి ..నన్ను కలిసి ఫొటోస్ తీసుకొని ఆటోగ్రాఫ్ తీసుకునే వాళ్ళని నేను గౌరవిస్తాను . కానీ నాకు తెలియకుండా ఇలా నా ప్రైవసీకి భంగం కలిగిస్తూ నా రూమ్ లోకి వచ్చి ఇలాంటి చెత్త పనులు చేసే వాటిని సహించను. దయచేసి ఆటగాళ్ల ప్రైవసీని గౌరవించండి” అంటూ లీక్డ్ వీడియోను ఉద్దేశిస్తూ మండిపడ్డారు.

ఇదే వీడియో పై కోహ్లీ భార్య అనుష్క శర్మ ఆగ్రహం వ్యక్తం చేసింది. ” కొంతమంది కనికరం.. దయలేని అభిమానుల కారణంగా ఇలాంటి ఊహించిన సంఘటనను ఎదుర్కొంటాం. మీరు చెప్పండి ఇదే మీ పడకగదిలో జరిగి ఉంటే మీరేం చేసే వాళ్ళు “అంటూ సూటిగా ప్రశ్నించింది . అంతేకాదు ఈ లీక్డ్ వీడియో పై ఆసీస్ ఆటగాడు డేవిడ్ వార్నర్, పరిణితి చోప్రా కూడా మండిపడ్డారు . ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

 

 

View this post on Instagram

 

A post shared by Virat Kohli (@virat.kohli)