ప్రతి దీపావళికి బ‌న్నీ చేసే ఈ ప‌ని గురించి తెలిస్తే మెచ్చుకోకుండా ఉండ‌లేరు!

దీపావళి పండుగ ఆనంద ఉత్సాహాలతో జాతి, కుల, మత, వర్గ, విభేదాలను విస్మరించి సమైక్యంగా జరుపుకునే పండుగ. దీపావళి అంటే సెలబ్రేషన్స్ ఆఫ్ లైట్స్.. ఈ పండుగను చిన్నా, పెద్ద అంటూ తేడా లేకుండా ఎంతో ఆనందంగా సెలబ్రేట్ చేసుకుంటారు. మిగతా పండుగలు కంటే ఈ పండగకి చిన్నపిల్లలతో పాటు పెద్ద వాళ్ళు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు. పిల్లలైతే క్రాకర్స్ కాల్చుకోవడానికి ఎంతో ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. అయితే కొంతమంది పిల్లలకు క్రాకర్స్ కొనుక్కునే స్థోమత ఉండకపోవడంతో ఎంతో నిరాశ పడుతూ ఉంటారు.

అయితే అలాంటి పిల్లల కోసం అల్లు అర్జున్ ఎప్పటినుంచో ఒక పని చేస్తూ ఉన్నాడట. అయితే ప్రతి దీపావళికి బన్నీ చేసే ఈ పని గురించి తెలిస్తే మెచ్చుకోకుండా ఉండలేరు. ఇంతకీ అదేమిటంటే అల్లు అర్జున్ పేద పిల్లలకు, అనాధ పిల్లలకు దీపావళి రోజున క్రాకర్స్ పంచుతూ వాళ్ళు పడే ఆనందాన్ని చూసి చాలా సంతోషిస్తాడట. అయితే ఆయన ఈ పనిని తన మొదటి సంపాదన వచ్చినప్పటినుండి చేయడం అలవాటు చేసుకున్నారని సమాచారం. అయితే ఇక ఈసారి దీపావళి పండుగకి కూడా అనాధ పిల్లలకు మరియు పేద వాళ్లకు క్రాకర్స్ పంచాలని డిసైడ్ అయ్యారని తెలుస్తుంది. ఈ విషయం తెలిసిన నెటిజన్లు బన్నీని మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు.