సమంత, అమలను చిన్న చూపు చూసేదట? నాగార్జున సీరియస్ వెనుక అదేనా కారణం? 

వారు విడాకులు తీసుకొని సంవత్సరం కావస్తున్నా సమంత, అమల, నాగార్జున, చైతన్య పేర్లు తెలుగు మీడియాలో ఇప్పటికీ వినబడుతున్నాయి. తెలుగు పరిశ్రమలో అక్కినేని వారసుడు అయినటువంటి చైతన్య తన తండ్రి నాగార్జునకు మల్లె స్టార్ హీరోయిన్ సమంతను పెళ్లిచేసుకొని, తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు. అయితే ఆ ఆనందం అక్కినేని ఫ్యామిలీ వాళ్ళు ఎంతోకాలం మిగల్చలేదు. పెళ్లిచేసుకున్న అనతికాలంలోనే నాగ చైతన్య – సమంత విడాకులు తీసుకున్నారు.

ఇక వారు విడిపోయిన నాటినుండి వారి గురించి అనేక పుకార్లు షికారు చేస్తున్నాయి. ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరోయిన్ లో సమంత ముందు వరుసలో వుంది అనడంలో అతిశయోక్తి లేదు. ఏ మాయ చేసావే సినిమా టైంలో సమంత నాగ చైతన్య ల మధ్య ప్రేమ కుదిరి అది కాస్త వివాహంగా మారింది. కానీ అది మూన్నాళ్ళ ముచ్చటగానే మిగిలిపోయింది. దాంతో ఎవరి సినిమాలు వారు చేసుకొని బిజీగా మారిపోయారు. ఈ క్రమంలో నాగ చైతన్య కాస్త వెనక పడినా, సమంత మాత్రం పాన్ ఇండియా స్థాయిలో అవకాశాలను అందిపుచ్చుకుంటూ దూసుకుపోతోంది.

ఇకపోతే తాజాగా వీరి విడాకులపై అమల నాగార్జున కు సంబంధించి ఓ వార్త సోషల్ మీడియాలో షికారు చేస్తోంది. సమంత ఓ సందర్భంలో అత్తయ్య అమలను దారుణంగా అవమానించిందంట. అప్పటినుండి సమంతపై నాగార్జున గుర్రుగా ఉండేవాడట. అంతే కాకుండా అక్కినేని ఇంటి కోడలిగా కూడా సమంత అర్హత లేదని ఆ కుటుంబం భావించిందట. ఆ కారణంగానే చైతన్య సమంత కు విడాకులు ఇచ్చాడని తాజాగా పుకార్లు షికారు చేస్తున్నాయి.

Share post:

Latest