ఆ స్టార్ హీరో కొడుకుతోనూ రోజా కూతురు ఫ‌స్ట్ రొమాన్స్‌….!

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ రోజా గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేదు. అప్పట్లో రోజా ఎన్నో సినిమాల్లో హీరోయిన్ గా నటించి కొన్ని సంవ‌త్స‌రాల పాటు ఇండస్ట్రీనీ ఒక ఊపు ఊపింది. అంతేకాకుండా స్టార్ హీరోలందరి సరసన హీరోయిన్ గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. అలా సినిమాల ద్వారా ఎంతో పేరు తెచ్చుకుని.. ప్రస్తుతం రోజా మంత్రిగా రాజకీయాలలో త‌న సత్తాను చాటుతున్న విషయం తెలిసింది.

 

రోజాకు ఒక కూతురు,ఒక కొడుకు ఉన్న విషయం మ‌న అంద‌రికి తెలిసిందే. ఇక కూతురు అన్షు మాలిక ఇప్పటికే ఎన్నో విషయాలలో తల్లికి తగ్గ కూతురు అనిపించుకుంటూంది. ఇక ఇది ఇలా ఉంటే తాజాగా రోజా కూతురు అన్షు మాలిక ను హీరోయిన్ గా సినిమాల్లో రానుంద‌ని కొద్ది రోజుల నుండి ప్ర‌చారం సాగుతుంది. ఇటీవల ఈమె అమెరికాలో ఫేమస్ ఫిలిం ఇన్సిస్టిట్యూట్లో నటనకి ట్రైనింగ్ కోసం సీటును సంపాదించిన్న‌ట్టు వార్తలు వినిపిస్తున్నాయి.

ఇంకా ఈ నేపథ్యంలోని ఒక స్టార్ హీరో కొడుకుతో అన్షు టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలోకి హీరోయిన్ గా అరంగేట్రం చేయ‌నుంద‌ని వార్తలు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారుతున్నాయి. మ‌రి ఆ హీరో ఎవరో కాదు కోలీవుడ్ స్టార్ హీరో విక్రమ్ కుమారుడు ధ్రువ విక్రమ్. ధ్రువ విక్రమ్ ఇటీవల తన తండ్రితో కలిసి మహాన్ అనే సినిమాలో నటించారు. ఇక టాలీవుడ్ లో కూడా తన కొడుకు ఎంట్రీ కోసం విక్రమ్ ఒక మంచి కథ కోసం వెతుకుతున్నట్లు తెలుస్తోంది.

ఆ సమయంలోనే హీరోయిన్ గా రోజా కూతురు అన్షు మాలికాకు హీరోయిన్ గా చాన్స్ ఇవ్వబోతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో ఈ వార్త విన్న రోజా అభిమానుల సైతం అన్షు హీరోయిన్గా రాణిస్తుందనే చెప్పుకొస్తున్నారు. ఈ వార్తలో ఎంత నిజం ఉంది అనే విషయం ఇంకా తెలియలేదు.. అయితే అధికారికంగా ప్రకటన వచ్చేవరకు వేచి చూడాల్సిందే మరి ఈ విషయంపై ఎవరో ఒకరు క్లారిటీ ఇస్తే బాగుంటుందని సినీ అభిమానులు భావిస్తున్నారు.

Share post:

Latest