నాగ చైతన్య – సమంత ఇద్దరిలో ఎవరి సంపాదన ఎక్కువో తెలిస్తే షాక్ అవుతారు!

నాగ చైతన్య – సమంత విడిపోయి సంవత్సరం కావస్తున్నా ఇంకా వారి ఎడబాటుని జీర్ణించుకోలేక పోతున్నారు అక్కినేని అభిమానులు. అవును… ఏమాయ చేసేవే సినిమాతో కలిసిన ఈ జంట ప్రేమ, తరువాత పెళ్లితో సరిగ్గా సంవత్సరం క్రితం ఒక్కటయ్యారు. ఇద్దరి మధ్య ఏమయ్యింది తెలియదు కానీ, మొదట ఆదర్శవంతమైన దంపతులుగా వున్న వీరు హఠాత్తుగా ఒకరోజు వారు విడిపోతున్నట్లు సోషల్ మీడియా ద్వారా ప్రేక్షకులకు తెలియజేసారు. దాంతో అక్కినేని కుటుంబంతో పాటు… అక్కినేని అభిమానులు కూడా అవాక్కయ్యారు.

ఇక వీరు విడిపోయి సంవత్సరం కావస్తున్నా, వారు విడిపోవడానికి గల కారణాలు కొంతమంది అన్వేషిస్తూనే వున్నారు. అయితే ఇంతవరకు వారు మాత్రం ఫలానా అని కారణం మాత్రం చెప్పలేదు. ఇద్దరూ ఎవరికీ వారు తమ సినిమా లైఫ్ లో బిజీగా వున్నారు. ఈ క్రమంలో సమంత పాన్ ఇండియా హీరోయిన్ గా ఎదిగిపోయింది. చైతన్య నుండి ఆ స్థాయి సినిమాలు వచ్చినా, కాలం మాత్రం కలిసిరాక అవి ప్లాపులుగా మిగిలిపోయాయి. తాజాగా పాన్ ఇండియా స్థాయిలో రిలీజైన ‘లాల్ సింగ్ చద్దా’నే దానికి ఓ ఉదాహరణ.

ఈ కారణంగా ఇద్దరి రెమ్యునరేషన్ విషయంలో కూడా ఎంతో తేడా వచ్చేసింది. ప్రస్తుత లెక్కల ప్రకారం నాగ చైతన్య కంటే సమంతానే ఎక్కువగా సంపాదిస్తోంది అని టాలీవుడ్లో గుసగుసలు వినబడుతున్నాయి. దాంతో ఆస్తి విషయంలో కూడా ఇద్దరికీ చాలా వ్యత్యాసం ఉందని టాక్. అదంతా పక్కన బెడితే…. ఆమధ్య వీరు హైదరాబాద్ లో కలిసి ఉంటున్న ఇంటిని మరలా సమంత కొనుగోలు చేసిందనే వార్తలు రావడం అందరికీ తెలిసినదే. ఈ విషయం తెలిసినప్పటినుండి సామ్ తన జ్ఞాపకాలను ఇంకా మర్చిపోలేదు అని కొందరు అనుకోవడం గమనార్హం.

Share post:

Latest