స్టార్ హీరోయిన్స్ తో మల్టీస్టారర్ మూవీ..ఇక రచ్చ రంబోలా..!?

సౌత్ సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్స్‌ సమంత, కీర్తి సురేష్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కీర్తిసురేష్ మహానటి సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ సినిమాలో కీర్తి సురేష్ నిజంగా అలనాటి హీరోయిన్ సావిత్రి లాగానే నటించింది. ఆ సినిమాతో మహానటి అని గుర్తింపు కూడా తెచ్చుకుంది. స్టార్ హీరోయిన్ సమంత గురించి అందరికీ తెలిసిందే. ఇటు సౌత్ సినిమా ఇండస్ట్రీ నుంచి బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీ వరకు సమంత సినిమాలు చేసుకుంటూ వెళ్తుంది. సమంత విజయాలకు అపజయాలకు సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటూ వెళ్ళిపోతుంది.

Here's what Keerthy Suresh has to say about Samantha Akkineni's Red Carpet  look

కీర్తి సురేష్ కూడా మహేష్ బాబుతో వచ్చిన సర్కారు వారి పాట సినిమాతో భారీ సక్సెస్ ను తన ఖాతాలో వేసుకుంది.ఇదే క్రమంలో వరుస సినిమాలో చేసుకుంటూ దూసుకుపోతుంది. భోళా శంకర్ సినిమాలో చిరంజీవికి చెల్లెలుగా నటిస్తుంది. వరుస సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతుంది కీర్తి సురేష్. సమంత తెలుగులో శకుంతల, యశోద, ఖుషి వంటి సినిమాలలోో నటిస్తుంది. తాజాగా వీరిద్దరి గురించి సోషల్ మీడియాలో ఒక వార్త బయటకు వచ్చింది. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ లోకేష్ కనగరాజ్‌ సినిమాలో వీరిద్దరూ కలిసి నటిస్తున్నారన్న వార్తలు బయటికి వస్తున్నాయి.

లోకేష్ కనగరాజ్‌ వీరిద్దరిని కలిసి స్టోరీ కూడా చెప్పిన్నట్లు తెలుస్తుంది. దీంట్లో కీర్తి సురేష్ ఫ్లాష్ బ్యాక్ లో విజ‌య్‌కు భార్యగా ఒక పవర్ఫుల్ రోల్ లో నటిస్తుందట. సమంత నెగెటివ్ షేట్స్ ఉన్న క్యారెక్టర్ లో నటించబోతుందని తెలుస్తుంది. వీళ్ళిద్దరి మల్టీస్టారర్ సినిమా కన్ఫర్మ్ అయినట్లు తెలుస్తుంది.