“మా నాన్న ఇక డైరెక్షన్ కి పనికి రాడు”..హీరో సంచలన కామెంట్స్..!?

ఓ సినిమాని డైరెక్ట్ చేయడం అంటే మాటలు కాదు . అంత ఈజీ అయిన పని కాదు . వాళ్లు రాసుకున్న కథను ఆ హీరో హీరోయిన్లతో తెరకెక్కించడం ఒక్క ఎత్తు అయితే.. జనాలకు అర్థమయ్యేలా చెప్పడం మరో ఎత్తు. అంత సులువైన పని కాదు దానికి ఎంతో శ్రద్ధ , ఓపిక, కృషి, పట్టుదల అన్ని ఉండాలి. నిజానికి సినిమాలో హీరో హీరోయిన్ కన్నా ముఖ్యపాత్ర ఎవరిది అంటే డైరెక్టర్ ది. డైరెక్టర్ తెర వెనక ఉండి నడిపిస్తే ..తెరపై నడిపించే డైరెక్టర్ హీరో హీరోయిన్. కాగా ఈ మధ్యకాలంలో బడా బడా డైరెక్టర్స్ తీసిన సినిమాలు అన్ని బాక్సాఫీస్ వద్ద బోల్తా కొడుతున్నాయి.

దానికి మెయిన్ రీజన్ తీసిన కథని మళ్లీ మళ్లీ మార్చి మార్చి తీయడం. దీంతో తీసే డైరెక్టర్ కి ఎలాగుందో కానీ, చూసే జనాలకు మాత్రం బోర్ కొట్టేసాయి. అందుకే దెబ్బకు ఫ్లాప్ చేసి పక్కన పడేస్తున్నారు జనాలు. కోట్లు ఖర్చు పెట్టి సినిమాలు తీస్తున్న కనీసం పెట్టిన అసలు డబ్బులు రాని పరిస్థితి వస్తుంది . దీనికి బెస్ట్ ఉదాహరణ ప్రభాస్ రాధే శ్యామ్ సినిమా . దాదాపు 100 కోట్ల లాస్ తెచ్చుకుంది అంటూ మీడియాలో వార్తలు రావడం మనం చూశాం.

ఈ క్రమంలోనే బాలీవుడ్ బడా హీరో హృతిక్ రోషన్ తన తండ్రి డైరెక్టర్ గా ఇక పనికిరాడు అంటూ చేసిన కామెంట్స్ ఇప్పుడు బాలీవుడ్ మీడియాలో వైరల్ గా మారాయి. మనకు తెలిసిందే రాకేష్ రోషన్ ప్రముఖ భారతీయ నిర్మాతగా, దర్శకుడిగా, నటుడిగా ప్రసిద్ధి చెందారు . దాదాపు 84 సినిమాల్లో నటించిన ఈయన..సినిమాలు నిర్మించడంలో ఎంత స్పెషలో.. సినిమాను డైరెక్ట్ చేయడంలోనూ అంతే సత్తా ఉన్న డైరెక్టర్ .

కానీ ఎందుకో తెలియదు ఆయన చేసే సినిమాలు మాత్రం జనాలు ఆకట్టుకోలేకపోతున్నాయి . ఈ క్రమంలోనే నెక్స్ట్ సినిమా ఎలాగైనా హిట్ కొట్టాలని హృతిక్ రోషన్ తన తదుపరి సినిమాని వేరే డైరెక్టర్ తో ప్లాన్ చేసుకుంటున్నారట. హృతిక్ రోషన్ క్రిష్ 4 గురించి ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుంటున్నట్టు బాలీవుడ్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి . ఫోర్త్ వర్షన్ తో ఎలాగైన సరే బిగ్గెస్ట్ హిట్ కొట్టాలని పక్కా ప్లాన్ తో ఈసారి ఆ ఛాన్సును బాలీవుడ్ బిగ్ డైరెక్టర్ కి ఇవ్వబోతున్నట్లు తెలుస్తుంది .అంతేకాదు రీసెంట్ గా.. ఇదే విషయంపై తన సన్నిహితులతో మాట్లాడుతూ..” మా నాన్న ఇక డైరెక్షన్ కి పనికిరాడు వేస్ట్ “అంటూ చెప్పుకోచ్చారట. ప్రస్తుతం ఇదే వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Share post:

Latest