వామ్మో..మళ్లీ పెంచేసిన సమంత..మొగుడు లేకపోయినా ఆ విషయంలో తగ్గేదేలే..!?

సౌత్‌లో టాప్ హీరోయిన్స్‌లో ఒకరిగా ఉన్న‌ సమంత చైతుకు దూర‌మ‌య్యాక త‌ర్వాత వ‌రుస పెట్టి సినిమాలు చేసుకుంటూ పోతోంది. అటు బాలీవుడ్‌తో పాటు ఇటు టాలీవుడ్‌లో సినిమాలు చేస్తోంది. టాలీవుడ్‌లో ప్ర‌స్తుతం ఆమె చేస్తోన్న మూడు సినిమాలు లైన్లో ఉన్నాయి. య‌శోద‌, శాకుంత‌లం, విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో ఖుషీ సినిమాలు చేస్తోంది. ఇక తాజాగా స‌మంత రెమ్యునరేషన్‌కి సంబంధించి ఓక వార్త‌ చక్కర్లు కొడుతోంది.

ప్రస్తుతం సౌత్‌లో హీరోయిన్ నయనతార అందరి కన్నా ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటుంది.. సమంత ఆమె తర్వాత‌ స్థానంలో ఉన్నట్లు తెలుస్తోంది. వరుస హిట్లు, స్పెషల్ సాంగ్స్, వెబ్ సిరీస్‌లతో దూసుపోతున్న‌ సమంత హాలీవుడ్ రేంజ్‌కి చేరిన విష‌యం తెలిసిందే. దీంతో సమంత తన రెమ్యునరేషన్‌ను భారీగాపెంచింది ప్రస్తుతం సమంత ఒక్కో సినిమాకు రూ.3 కోట్ల నుంచి రూ.5 కోట్ల రేంజ్లో డిమాండ్ చేస్తోంది.

పుష్ప సినిమాలో మొదటిసారి ఐటెం సాంగ్‌లో మెరిసిన సమంత.. అందుకు గాను ఏకంగా రూ. 2 కోట్లు రెమ్యునరేషన్‌గా తీసుకుందనే ప్రచారం ఉంది. తాజాగా చేయబోయే సినిమాల్లో యశోద – శాకుంతలం సినిమాలకు 2.5 కోట్ల చొప్పున రెమ్యూనిరేషన్ ఇచ్చినట్లు తెలుస్తుంది. తాజాగా ఇప్పుడు చేసే కొత్త సినిమాలు గాను 3.5 కోట్ల రెమ్యున‌రేషన్ డిమాండ్ చేస్తుందని తెలుస్తుంది.

Share post:

Latest