NTR అభిమానులకు RRR విషయంలో ఊరట లభించింది… ఆస్కార్ బరిలో జూనియర్!

పరిచయం అక్కర్లేని నటుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. ఈమధ్య కాలంలో జక్కన్న దర్శకత్వంలో రామ్ చరణ్ – ఎన్టీఆర్ ప్రధాన పాత్రలుగా వచ్చిన ఫిల్మ్ ‘RRR’ ఎలాంటి ప్రభంజనం సృష్టించిందో అందరికీ తెలిసినదే. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్టయినప్పటికీ నందమూరి అభిమానులు మొదట ఒకింత అసహనానికి లోనయ్యారు. ఈ సినిమాలో జక్కన్న రామ్ చరణ్ పాత్ర కంటే ఎన్టీఆర్ పాత్రని కాస్త తక్కువ చేసాడని భ్రమ పడ్డారు. ఈ విషయంలో రాజమౌళి పైన తమ అక్కసుని కూడా వెళ్లగక్కారు. అయితే తాజాగా ఓ న్యూస్ వారిని ఆ బాధకు దూరమయ్యేలా చేసింది.

అవును… ఈ సినిమాలో రామ్ చరణ్ – ఎన్టీఆర్ ఇద్దరు అద్భుతమైన పెర్ఫామెన్స్ ఇచ్చి ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు అందుకున్న విషయం విదితమే. ఇదే విషయంలో తాజాగా ఆస్కార్ బరిలో నిలిచారు ఎన్టీఆర్. ఉద్యమ వీరులు అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్, గొండు బెబ్బులి కొమురం భీం పాత్రలో తారక్ నటించారు. ముఖ్యంగా ఈ చిత్రంలోని ఎన్టీఆర్ పెర్ఫామెన్స్ కు ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇప్పటికే RRR రిలీజ్ కు ముందు రాజమౌళి చెప్పినట్టుగా.. ప్రపంచం మొత్తం తారక్ వైపు చూస్తోంది.

ముఖ్యంగా “కొమురం భీముడో” పాటలో ఎన్టీఆర్ చేసిన నటనకు వరల్డ్ వైడ్ ఆడియెన్స్ థ్రిల్ ఫీల్ అయ్యారు. దాంతో ఎన్టీఆర్ పెర్ఫామెన్స్ కు గ్లోబల్ రెస్పాన్స్ అదిరిపోవడమే కాకుండా.. ‘ఆస్కార్’ (Oscar 2023) బరిలోనూ ఎన్టీఆర్ పేరు ఉన్నట్టు తెలుస్తోంది. ఈ విషయమై ప్రముఖ హాలీవుడ్ ‘వెరైటీ’పబ్లికేషన్ విడుదల చేసిన ‘ఆస్కార్స్ 2023’ ప్రిడిక్షన్ లిస్ట్ లో ‘ఎన్టీఆర్’ పేరు ఉంది. ‘ఆర్ఆర్ఆర్’లోని తారక్ అద్భుతమైన నటనకు గాను ఆస్కార్ బరిలో నిలిచినట్టు వెల్లడించారు. వెరైటీ మ్యాగజైన్ విడుదల చేసిన ఈ ప్రిడిక్షన్ లిస్ట్ లో ప్రైడ్ ఆఫ్ ఇండియన్ సినిమాగా ‘ఎన్టీఆర్’ నిలిచారు. దాంతో నందమూరి అభిమానులు పండగ చేసుకుంటున్నారు.