Jr. NTR ఫ్యాన్స్ ఆ విషయంలో ఇంకా సంతృప్తి చెందలేదా? తదుపరి చిత్రం సంగతేంటి?

Jr NTR గురించి ప్రత్యేకించి ప్రస్తావన అవసరం లేదు. RRR సినిమా తర్వాత NTR అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కించుకున్నాడు. విదేశీ మీడియా సంస్థలు కూడా NTR నటనాకౌశల్యాన్ని గురించి ప్రశంసలు కురిపించారు. అయితే NTR అభిమానులు మాత్రం RRR సినిమా విషయంలో సందర్భం వచ్చినప్పుడల్లా కాసింత అసహనాన్ని వెళ్లగక్కుతూనే వున్నారు. ఇటీవల ఓ హాలీవుడ్ పత్రిక ఆస్కార్ నామినేషన్లకు NTR విషయాన్ని పేర్కొన్న విషయం తెలిసినదే. అయితే ఈ విషయం వినైనా అతని అభిమానులు సంతృప్తి చెందడంలేదా? అని కొందరు సినీ ప్రముఖులు గుసగుసలాడుకుంటున్నారు.

ఇకపోతే NTR తదుపరి సినిమా విషయంలో కూడా నత్తనడకే కొనసాగుతోంది. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన ఆచార్య సినిమా ప్లాప్ అవ్వడంతో NTR 30 సినిమా డైలమాలో పడ్డట్లు తెలుస్తోంది. ఎప్పుడో ప్రారంభం అవ్వాల్సిన NTR – కొరటాల కాంబో సినిమాను ఇంకా స్టార్ట్ చేయకపోవడం పలు అనుమానాలకు దారితీస్తోంది. ఈ క్రమంలో అసలు NTR సినిమా ఉంటుందా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ విషయమై నిర్మాత కళ్యాణ్ రామ్ స్పందిస్తూ ఎన్టీఆర్‌ స్థాయికి తగ్గట్లుగా కథను రెడీ చేసేందుకు సమయం పడుతుంది అని చెప్పడం కొసమెరుపు.

NTR మరియు కళ్యాణ్ రామ్‌ల యొక్క సినిమా కావడంతో నందమూరి అభిమానులు కొరటాల శివ దర్శకత్వంలో రూపొందబోతున్న ఈ సినిమాపై అంచనాలు పెట్టుకున్నారు. కాని సినిమా విషయంలో జాప్యం జరగడంతో నందమూరి అభిమానులు మానసికంగా ఫీల్ అవుతున్నారు. NTR మరియు కొరటాల గతంలో జనతా గ్యారేజ్‌ సినిమాతో వచ్చారు. అయితే ఆ సినిమా హిట్ అయింది కానీ, పెద్దగా చెప్పుకోదగ్గ విజయాన్ని మాత్రం సొంతం చేసుకోలేదు. అయితే ఇలాంటి తరుణంలో ఈ సినిమా వుంటుందా లేక మరేదైనా పట్టాలెక్కుతుందా అనేది వేచి చూడాల్సిందే.

Share post:

Latest