‘నువ్వు నా స్టేటస్ కి సెట్ కావు’.. నవీన్ చంద్రను దారుణంగా అవమానించిన మెగా హీరోయిన్..?

ఈప్రపంచంలో ధనంతోనే ఆప్తులు.. ధనంతోనే బంధాలు.. ధనంతోనూ ప్రేమలు.. ధనం ఉంటేనే ఇవన్నీ నీ చెంతకు వస్తాయి. ధనం లేకుంటే ఎవ్వరూ నీ దగ్గరకు కూడా రారు.. ప్రస్తుతం సమాజంలో డబ్బు మెయిన్ రోల్ పోషిస్తుంది.. అది సామాన్యులైనా.. సెలబ్రెటీలైనా.. డబ్బును చూసే మనిషికి విలువ ఇస్తున్నారు. మన సినీ ఇండస్ట్రీలో కూడా డబ్బులు లేక అవమాన పడ్డ హీరోలు చాలా మంది ఉన్నారు. వారిలో హీరో నవీన్ చంద్ర కూడా ఒకరు.. నవీన్ చంద్ర హీరోగానే కాదు విలన్ గా కూడా సక్సెస్ అయ్యాడు..

నవీన్ చంద్ర ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ చాలా బిజీగా ఉన్నాడు.. ఇటీవల పరంపర వెబ్ సిరీస్ లో అద్భుతమైన నటనతో మెప్పించాడు. నవీన్ చంద్రకు కోలివుడ్ లో కూడా మంచి అవకాశాలు వస్తున్నాయి. అయితే నవీన్ చంద్ర తన కెరీర్ మొదట్లో చాలా ఇబ్బందులు పడ్డాడట..ఆర్థిక ఇబ్బందులు అనేవి అందరికీ వస్తాయి. కానీ ఓ హీరోయిన్ మాత్రం తన ఫైనాన్షియల్ స్టేటస్ చూపించి దారుణంగా అవమానించిందట.. మెగా హీరోలతో వరుస పెట్టి సినిమాలు చేసిన ఓ హీరోయిన్ నవీన్ చంద్రతో కూడా మూవీ చేసింది..

అయితే ఆ సమయంలో ఆమె నవీన్ చంద్రతో చాలా బాగా ఉండేది. చాలా క్లోజ్ గా అతనితో తిరిగింది.. ప్రేమ అంటూ పుకార్లు కూడా పుట్టించుకుంది.. తన పేరు మీడియాలో హైలెట్ అయ్యేలా చేసుకుంది.. ఆ సినిమా హిట్ అయ్యే సరికి ఈ హీరోయిన్ నిజస్వరూపం బయటపడింది. నవీన్ చంద్రను ఆమె దారుణంగా మోసం చేసింది. ‘నువ్వు నా స్టేటస్ కి తగినవాడివి కాదు.. ఇండస్ట్రీలో నీ స్టేటస్ ఎంటో తెలుసుకో’ అంటూ దారుణంగా అవమానించిందట.. ఆ హీరోయిన్ మాటలకు నవీన్ చంద్ర ఎంతో బాధపడ్డాడు. ఆ తర్వాత ఆమె ముఖం కూడా మళ్లీ చూడలేదట.. ఆ తర్వాత తన టాలెంట్ తో పైకొచ్చి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు.