Bigg Boss 6లోకి RGV హాట్ బ్యూటీ.. అలా ఆఫర్ కొట్టేసిందా?

Bigg Boss 6 ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ప్రేక్షకులకు గత రెండు మూడు రోజులుగా శుభవార్తలమీద శుభవార్తలు వినబడుతున్నాయి. బిగ్ బ్రదర్ అనే ఇంగ్లీష్ రియాలిటీ షో ఆధారంగా వచ్చి.. చాలా తక్కువ సమయంలోనే ఇండియాలో దూసుకుపోతున్న షో ఏదన్నా వుంది అంటే అది ఇదే. ఎప్పటికప్పుడు సరికొత్త కంటెంట్‌ను చూపిస్తూ సుదీర్ఘ కాలంగా సందడి చేస్తోన్న ఈ షో.. ఐదేళ్ల క్రితమే తెలుగులోకి కూడా పరిచయమైంది. మరే భాషలో లేని విధంగా ఇక్కడ ఈ కార్యక్రమానికి భారీ స్థాయిలో స్పందన దక్కడం విశేషం. ఇండియాలో ఈ షో TRP రేటింగ్ చూస్తే ఇక్కడి ప్రజలు ఇంత ఖాళీగా వున్నారా? అని అనిపించక మానదు.

ఇక ఆడియన్స్ ఆసక్తిని బిగ్ బాస్ బాగానే కేప్చర్ చేస్తున్నాడని చెప్పుకోవచ్చు. ఎలా అంటే షో షోకి అందమైన హాట్ సెలిబ్రిటీలను తీసుకొస్తున్నారు. దాంతో మామ్మూలుగానే కుర్రకారు దీనికి అట్రాక్ట్ అవుతున్నారు. ఇక ఇండియా మొత్తంలో ఈ షో చూసినవాళ్లలో ఎక్కువగా యూత్ ఉండటం కొసమెరుపు. అందులోనూ ఎక్కువగా మహిళలే ఎక్కువగా చూస్తున్నారని ఓ సర్వే. ఈ ఉత్సాహంతోనే నిర్వహకులు సీజన్లను పూర్తి చేసుకుంటూ వస్తున్నారు. ఈ క్రమంలోనే త్వరలోనే ఆరో దానిని మొదలు పెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సీజన్‌లో పాల్గొనే మరో కంటెస్టెంట్ వివరాలు తాజాగా బయటకు వచ్చాయి.

ఇంతకీ ఆ సెలెబ్రిటీ ఎవరంటే.. RGV కాంపౌండ్ నుండి అడుగుపెట్టబోతోంది. ఆరో సీజన్‌లో కాంట్రవర్శీ, గ్లామరస్ బ్యూటీలను ఎక్కువగా తీసుకు రాబోతున్నారని టాలీవుడ్లో గుసగుసలు జోరుగా సాగుతున్నాయి. ఈ క్రమంలోనే ఎంతో మంది అమ్మాయిల పేర్లు కూడా బయటకు వచ్చాయి. ఈ క్రమంలోనే మరో బ్యూటీ పేరు లీకైంది. తాజా సమాచారం ప్రకారం.. రాంగోపాల్ వర్మ వల్ల ఫేమస్ అయిన హీరోయిన్ “ఇనయా సుల్తానా” కంటెస్టెంట్‌గా రాబోతుందని వినికిడి. ఇంకేముంది ఇదేగాని నిజమైతే బిగ్ బాస్ బాక్స్ బద్దలైనట్టే!