మెగాస్టార్ సినిమాకు ర‌వితేజకు షాకింగ్ రెమ్యున‌రేష‌న్‌… ఇన్ని కోట్లా…!

మాస్ మ‌హ‌రాజ్ ర‌వితేజ ఇటీవ‌ల కాలంలో సినిమా హిట్లు, ఫ‌ట్‌తో సంబంధం లేకుండా రెమ్యున‌రేష‌న్ తీసుకుంటున్నాడు. రెమ్యున‌రేష‌న్ విష‌యంలో నిర్మాత‌ల ముక్కు పిండి మ‌రీ ఆయ‌న రెమ్యున‌రేష‌న్ వ‌సూలు చేస్తున్నాడ‌న్న టాక్ అయితే ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో ఉంది. క్రాక్‌తో హిట్ కొట్టి ఫామ్‌లోకి వ‌చ్చినా ఆ వెంట‌నే ఖిలాడీ సినిమాతో డిజాస్ట‌ర్ ఇచ్చాడు.

ఖిలాడీ సినిమాకే ర‌వితేజ‌కు ఏకంగా రు. 20 కోట్లు ముట్టాయ‌ని అన్నారు. ఇక రామారావు అన్‌డ్యూటీ విష‌యంలో కాల్షీట్ల లెక్క‌న ర‌వితేజ రెమ్యున‌రేష‌న్ తీసుకుంటే ఏకంగా రు. 22 కోట్ల‌కు పైనే ముట్టింద‌ని అంటున్నారు. ఇక ఇప్పుడు మాస్ మ‌హ‌రాజ్ ఏకంగా మెగాస్టార్ చిరంజీవి సినిమా వాల్తేరు వీర‌య్య‌లో న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే.

ఈ సినిమా కోసం ర‌వితేజ ను తీసుకున్న‌ట్టు గ‌తంలోనే వార్త‌లు వ‌చ్చాయి. ఇప్పుడు రెమ్యున‌రేష‌న్ కూడా సెటిల్ అయ్యిందంటున్నారు. ఈ సినిమా కోసం రవితేజ దాదాపు 16 రోజులు వర్క్ చేయాల్సి వుందట. అయితే ఫుల్ రెమ్యూనిరేషన్ ఇచ్చేందుకు ఓకె అయ్యాకే గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడంటున్నారు. ర‌వితేజ లేటెస్ట్ గా రావణాసుర సినిమాకు 18 కోట్లు తీసుకుంటుండ‌గా ఈ వాల్తేరు వీర‌య్య‌కు కూడా అంతే రెమ్యున‌రేష‌న్ తీసుకుంటున్నాడ‌ట‌.

Share post:

Latest