భారీ స్థాయి లో పారితోషికం పెంచేసిన పవిత్ర లోకేష్..ఎన్ని లక్షలంటే..?

ప్రముఖ నటి పవిత్ర లోకేష్ గురించి ఇప్పుడు పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈమె తన సినిమాలతో ఎంతైతే పాపులర్ సంపాదించుకుందో.. అంతకంటే ఎక్కువగా సహనటుడు వీకే నరేష్ తో సహజీవనం చేస్తోంది అనే విషయంపై మరింత పాపులర్ సంపాదించుకోవడం గమనార్హం. ఇక కృష్ణ సపోర్ట్ తోనే సహజీవనం చేస్తున్నామని, ప్రేక్షకుల అండదండ కావాలి అని , సభాముఖంగా మీడియా ముందు నిరభ్యంతరాయంగా పవిత్ర లోకేష్ అందరినీ కోరింది. ఇక ఈ విషయంపై రంగంలోకి దిగిన నరేష్ మూడవ భార్య రమ్య రఘుపతి కూడా నానా రభస చేసింది .అంతేకాదు కర్ణాటకలోని ఒక హోటల్ గదిలో పవిత్ర లోకేష్, వీకే నరేష్ ఇద్దరు ఒకే గది నుంచి రావడంతో పవిత్ర లోకేష్ ను చెప్పుతో కొట్టే ప్రయత్నం కూడా చేసింది రమ్యారఘుపతి. ఇక ఇలా రకరకాల వార్తలతో బాగా పాపులారిటీని సంపాదించుకుంది పవిత్ర లోకేష్.Veteran actress Pavitra Lokesh lodges complaint with Mysuru Cyber police over fake accounts- The New Indian Express

ఇక ఇటీవల శరత్ మండవ దర్శకత్వంలో రవితేజ హీరోగా నటించిన రామారావు ఆన్ డ్యూటీ చిత్రంలో కూడా.. ఈమె నరేష్ ఇద్దరూ కలిసి నటించడంతో.. వీరిద్దరి సన్నివేశం థియేటర్లలో వచ్చినప్పుడు ఈలలు గోలలు చేశారు సినీ ప్రేక్షకులు. ఇకపోతే ఈమె రేంజ్ ను బట్టి తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం పారితోషకం కూడా భారీగా పెంచేసింది అనే వార్తలు వైరల్ అవుతున్నాయి. పవిత్ర లోకేష్ పారితోషకం విషయానికి వస్తే.. గత కొన్ని రోజుల క్రితం వరకు ఆమె రోజుకు 60 వేల రూపాయలను మాత్రమే పారితోషకంగా తీసుకునేది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈమె ఏకంగా లక్షల రూపాయల పారితోషకం డిమాండ్ చేస్తుందని సమాచారం.

అటు ఇటుగా ఒక్కో సినిమాకు లక్ష రూపాయలు రోజుకు పారితోషకం డిమాండ్ చేస్తుందని ఇండస్ట్రీ వర్గాలలో వార్తలు వినిపిస్తున్నాయి. మరీ ముఖ్యంగా పవిత్ర లోకేష్ కు ఆఫర్లు పెరగడానికి నరేష్ కూడా తన వంతు సహాయం చేస్తున్నారని సమాచారం. ముఖ్యంగా రాబోయే రోజుల్లో సహజీవనం చేస్తున్న వీరు పెళ్లి చేసుకుంటారో ఏమో చూడాల్సి ఉంది.

Share post:

Latest