బిగ్ బ్లాస్టింగ్ అప్డేట్: ప్రభాస్ సినిమాలో మరో పాన్ ఇండియా హీరో..అభిమానులకు పిచ్చెక్కిపోవాల్సిందే..!!

యస్..ఇది నిజంగా అభిమానులకు పూనకాలు తెప్పించే మ్యాటర్. జనరల్ గా ఒక్క పాన్ ఇండియా హీరో సినిమా అంటేనే క్రేజ్, బజ్..ఎలా ఉంటుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అంతేకాదు..అభిమానుల ఎక్స్ పెక్టేషన్స్ రీచ్ అయ్యేలా పాన్ ఇండియా సినిమాలను తీస్తున్నారు డైరెక్టర్స్. అయితే, డైరెక్టర్స్ అందరిలోకి రాజమౌళి, ప్రశాంత్ నీల్ ఐడియాస్ , స్ట్రాటజీలు వేరుగా ఉంటాయి.

- Advertisement -

ఆ విషయం ఎవ్వరో చెప్పనవసరం లేదు. ఇప్పటి వరకు వాళ్లు తెరకెక్కించిన సినిమాలు చూస్తే ఆ విషయం క్లీయర్ గా అర్ధమైపోతుంది. రాజమౌళికి బ్రేక్ ఇచ్చింది మగధీర అయితే..ప్రశాంత్ కి బ్రేక్ ఇచ్చింది KGF సిరీస్..ఇప్పుడు ఈ ఇద్దరి పేర్లు ప్రపంచస్దాయిలో మారుమ్రోగిపోతున్నాయి. వీళ్ళ నుంచి వచ్చే నెక్స్ట్ సినిమా పై కూడా భారీ స్దాయిలో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు జనాలు.

ఇప్పుడు ఆ అంచనాలను ఢబుల్ చేస్తూ ప్రశాంత్ నీల్ తన తదుపరి సినిమా సలార్ లో ఇద్దరు పాన్ ఇండియా హీరోలను ఒక్కే తెర పై చూయించబోతున్నారట. ఇప్పటికే KGF సిరీస్ తో సరికొత్త ట్రెండ్ సెట్ చేసిన ప్రశాంత్..ఇప్పుడు బిగ్ బడా పాన్ ఇండియా స్టార్స్..ను ఒక్కే తెర పై చూయించే సాహసం చేస్తూ మరో ట్రెండ్ సెట్ చేయబోటున్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. సలార్ సినిమా ప్రభాస్ కాకుండా మరో పాన్ ఇండియా హీరో ని కూడా సీన్స్ లోకి యాడ్ చేశారంటూ ఓ న్యూస్ వైరల్ గా మారింది . కానీ, ఆ హీరో ఎవరు..అనేది మాత్రం సస్పెన్స్ గా ఉంచి చిత్ర బృందం. ఆ బిగ్ సర్ప్రైజ్ ని మనం నేరుగా ధియేటర్స్ లోనే చూడాలట. ఇప్పుడు అ మరో పాన్ ఇండియా హీరో ఎవరా అంటూ నెట్టింట కొత్త చర్చలు ప్రారంభమయ్యాయి.

Share post:

Popular