NBK107: “ముద్దుల మావయ్య” సెంటిమెంట్ ను రిపీట్ చేస్తున్న బాలయ్య..బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాల్సిందే..?

రికార్డులు నెలకొల్పాలి అన్నా..ఆ రికార్డ్లని బద్ధలు కొట్టాలి అన్నా..నందమూరి బాలయ్య తరువాతే ఎవ్వరైనా. అప్పట్లో బాలయ్య ఇండస్ట్రీకి ఇచ్చిన హిట్ల తో పోలిస్తే..ఇప్పుడు పాన్ ఇండియా సినిమా లు ఎందుకు పనికి వస్తాయి ..అని నందమూరి అభిమానులు కాలర్ ఎగరేసి చెప్పుకుంటున్నారు. బాలయ్య రేంజ్ కి, క్రేజ్ కి. స్టామినా కి..ఈనాటి కుర్ర హీరోలు ఏ మూలన సరిపోరు అన్నది వాస్తవం.

ఆయన నటించిన మంగమ్మ గారి మనవడు, బంగారు బుల్లోడు, ముద్దుల మావయ్య,సమర సింహా రేడ్డి, నరసింహ నాయుడు..ఇలా ఎన్నెన్నో క్రేజీ బ్లాక్ బస్టర్ సినిమాలతో సరికొత్త చరిత్రను సృష్టించాడు బాలయ్య. ప్రజెంట్ డైనమిక్ డైరెక్టర్ గోపీచంద్ మల్లినేని డైరెక్షన్ లో ఓ సినిమా, అనిల్ రావిపూడి తో మరో సినిమాకి కమిట్ అయ్యి ఉన్నాడు బాలయ్య. ప్రజెంట్ NBK107 షూటింగ్ లో బిజీ గా ఉన్న ఈయన..ఈ సినిమా షూటింగ్ ను త్వరగా ఫినిష్ చేసి..అనిల్ సినిమా ని సెట్స్ పైకి తీసుకురావడానికి ట్రై చేస్తున్నారట.

కాగా, తాజాగా NBK107 షూటింగ్ సెట్స్ నుండి ఓ ఇంట్రెస్టింగ్ మ్యాటర్ లీకైంది. ఈ సినిమా లో బాలయ్య డ్యూయెల్ రోల్ లో నటిస్తున్నారని..మనకు తెలిసిందే. అంతేకాదు ఈ సినిమాలో బాలయ్య సిస్టర్ సెంటిమెంట్ ని ఫాలో అవుతూ..సిస్టర్ పాయింట్ ప్రధానంగా ఉంటుందని తెలుస్తుంది. బాలయ్య నటించిన ముద్దుల మావయ్య చిత్రంలో అన్నా, చెల్లెలి సెంటిమెంట్‌ని ఆ రోజుల్లో డైరెక్టర్ కోడి రామకృష్ణ అద్భుతంగా చూపించారు. ముద్దుల మావయ్య 1989లో విడుదలై ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. బాలకృష్ణ, సీత, విజయశాంతి ఇందులో ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఇండస్ట్రీ హిట్‌గా నమోదైంది. అంతేకాదు..ఈ సినిమా అప్పట్లోనే అంటే.. 1989 లో అత్యధిక వసూళ్లు చేసిన చిత్రంగా నిలిచింది. మళ్ళీ ఇన్నాళ్లకి బాలయ్య సిస్టర్ సెంటిమెంట్ ఉన్న కంటెంట్ తో నటించడం అభిమానులను ఉత్సాహ పరుస్తుంది. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ బట్టి చూస్తే సినిమా బ్లాక్ బస్టర్ అని చెప్పేస్తున్న నందమూరి ఫ్యాన్స్..!!