భర్త మరణించిన 24 గంటలు గడవకముందే మీనా సంచలన నిర్ణయం.. షాకింగ్ ట్వీస్ట్ ఇచ్చిందే..?

టాలీవుడ్ లో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా రాజ్యమేలిన నటి మీనా. పేరుకి కోలీవుడ్ హీరోయిన్ నే అయినా..తెలుగులో మంచి మంచి సినిమాలు చేసి..స్టార్ హీరోయిన్ గా గుర్తింపు సంపాదించుకుంది. తమిళంలో రజనీకాంత్ తో కలిసి..బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటించిన ఈ అమ్మడు.. తెలుగులో ఆల్ మోస్ట్ అందరి స్టార్ హీరోలతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుని..సూపర్ హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంది.

కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే బెంగుళూరుకి చెందిన ఓ సాఫ్ట్ వేర్ అబ్బాయిని పెళ్ళి చేసుకున్న మీనా.. పెళ్ళి తరువాత సినిమాలకు దూరంగా ఉంది. మధ్యలో బుల్లితెర పై అడపదడపా కనిపించిన..ప్రెగ్నెన్సీ తరువాత మాత్రం పూర్తిగా కనిపించడం మానేసింది. ఇక ఆమె కూతురు నైనిక కొంచెం పెదది అయ్యాక..మళ్ళీ సినిమాలోకి రీ ఎంట్రీ ఇచ్చి..చేతికి వచ్చిన సినిమాలో నచ్చిన మూవీస్ ని చేసుకుంటుంది.

అయితే, రీసెంట్ గా మీనా భర్త విద్యాసాగర్ అనారోగ్య కారణంగా మరణించిన సంగతి తెలిసిందే. అతి చిన్న వయసుల్లోనే ఇలా తిరిగిరాని లోకానికి వెళ్లిపోవడం చాలా బాధాకరం అంటూ సెలబ్రిటీలు ఆయన మరణం పట్ల విచారం వ్యక్తం చేశారు. కాగా, మీనా భర్త చనిపోయాక మరింత డల్ అయ్యిందంటూ కోలీవుడ్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. అంతేకాదు, ఇక పై పాప బాధ్యతలు పూర్తిగా తానే చూసుకోవాలని,,సినిమాలకు గుడ్ బై చెప్పేసిందట. ఇప్పటికే కమిట్ అయిన సినిమాలకు సంబంధించిన అడ్వాన్స్ డబ్బులను కూడా తిరిగి ఇచ్చేసిందట. భర్త మరణించిన కొన్ని గంటలకే మీనా ఇలా చేయడం ఇందస్ట్రీలో సంచలనం గా మారింది.

Share post:

Popular