వామ్మో..పిచ్చెక్కించే కాంబో..మహేశ్ బాబు సినిమాలో మరో “బాబు”..గురూజీ రూటే వేరబ్బా ..?

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్..అంటే ఇండస్ట్రీలో అదో సపరేటు క్రేజ్ ఉంటుంది. హీరోలకు ధీటు గా ఆయనకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆయన తీసే సినిమాలో ఓ స్టైల్ ఉంటుంది. ఆయన రాసే డైలాగ్స్ ఇష్టపడని వాళ్లంటు ఉండరు. తనదైన టైమింగ్ తో రైమింగ్ తో ఇండస్ట్రీలో టాప్ దర్శకుల లిస్ట్ లో చోటు సంపాదించుకున్న త్రివిక్రమ్ శ్రీనీవాస్.. ప్రస్తుతం మహేస్ బాబు తో ఓ సినిమా కి కమిట్ అయ్యి ఉన్నాడు.

ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమాలు పూర్తి అవ్వగా..మరి కొన్ని వారల్లో సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానున్నట్లు తెలుస్తుంది. అయితే, ఇప్పటికే త్రివిక్రమ్ రాసుకున్న స్క్రిప్ట్ లో కొన్ని మార్పులు చెప్పిన మహేశ్ బాబు..సినిమా షూటింగ్ ని కూడా ఆరు నెలల వ్యవధిలోనే కంప్లీట్ చేయాలనే కండీషన్ తోనే సినిమాని ఓకే చేసారట. ఆ తరువాత వెంటనే దర్శకధీరుడు రాజమౌళి తో సినిమా షూటింగ్ ప్రారంభించనున్నాడు.

అయితే, రీసెంట్ SSMB28 సినిమా నుండి క్రేజీ రూమర్ నెట్టింట వైరల్ గా మారింది. ఈ సినిమాలో మహేశ్ బాబు పాతకు సరి సమానం గా ఉండేలా త్రివిక్రమ్ విలన్ పాత్రను రాసుకున్నాడట. ఆ పాత్రకు కలెక్షన్ కింగ్ మోహన్ బాబు అయితే సరిగ్గా సెట్ అవుతారని..ఆ బాడీ లాంగ్వేజ్ కు ఆ విలన్ పాత్ర ఆప్ట్ అని ..మోహన్ బాబు ని అప్రోచ్ అయి కధ వినిపించగా ఆయన కూడా ఓకే చెప్పిన్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. మోహన్ బాబు విలనిజం గురించి కొత్తగా చెప్పనవసరం లేదు ఆయన కళ్లు ఉరిమి..డైలాగ్ చెప్పితే..ధియేటర్స్ లో విజిల్స్ మోగాల్సిందే. ఒక్క వేళ్ళ నిజంగా ఈ కాంబో సెట్ అయితే..సినిమాకి మరింత ఊపు నిచ్చిన్నట్లే అవుతుంది. ఏది ఏమైన ఢిఫరేంట్ కాంబోలు సెట్ చేయడంలో త్రివిక్రమ్ శ్రీనీవాస్ రూటే వేరు అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Share post:

Latest