చిరు – బాల‌య్య బాక్సాఫీస్ వార్ రెడీ… ఎవ్వ‌రూ త‌గ్గేదేలే…!

మెగాస్టార్ చిరంజీవి, నంద‌మూరి బాల‌కృష్ణ త‌మ సినిమాల‌తో ఒకేసారి బాక్సాఫీస్ ద‌గ్గ‌ర పోటీ ప‌డితే పోరు మామూలుగా ఉండ‌ద‌రు. ఈ క్ర‌మంలోనే వీరిద్ద‌రు 2017 సంక్రాంతి కానుక‌గా త‌మ కెరీర్‌లోనే ప్ర‌తిష్టాత్మ‌క సినిమాల‌తో పోటీ ప‌డ్డారు. చిరు 150వ సినిమా ఖైదీ నెంబ‌ర్ 150, ఇక బాల‌య్య వందో సినిమా గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి సినిమా కూడా అదే సంక్రాంతికి రిలీజ్ అయ్యింది. ఈ రెండు సినిమాలు సూప‌ర్ హిట్ అయ్యాయి.

ఇక ఇప్పుడు మ‌రోసారి ఈ ఇద్ద‌రు స్టార్ హీరోలు త‌మ సినిమాల‌తో బాక్సాఫీస్ ద‌గ్గ‌ర పోటీకి రెడీ అవుతున్నారు. బాల‌య్య గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్లో తెరకెక్కుతున్న ఈ సినిమాను సెప్టెంబర్ ఆఖరి వారంలో రిలీజ్ చేయాల‌ని అనుకుంటున్నారు.

ఇక అదే టైంలో మోహన్ రాజా దర్శకత్వంలో చిరు న‌టించిన‌ గాడ్ ఫాదర్ సినిమా రిలీజ్ చేయాల‌ని అనుకుంటున్నారు. సెప్టెంబర్ 28న బాలయ్య చిత్రం, 30న చిరంజీవి గాడ్ ఫాదర్ సినిమా థియేటర్లలోకి వచ్చేలా ప్లాన్ చేస్తున్నారు. బాలయ్య అయితే ముహూర్తం తీసి మరీ, శుక్రవారం కాకపోయినా 28వ తేదీని ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది. సో బాల‌య్య సినిమా డేట్ మార్చ‌రు.

ఇక త‌గ్గితే చిరంజీవి మాత్ర‌మే వెన‌క్కు త‌గ్గాలి. అస‌లే థియేట్రిక‌ల్ వ్య‌వ‌స్థ అంతంత మాత్రంగా ఉంది. ఈ టైంలో ఇద్ద‌రు హీరోలు త‌మ సినిమాల‌తో పోటీ ప‌డితే మార్కెట్ ను నాశనం అవుతుంది.. బ‌య్య‌ర్లు కూడా దెబ్బ‌తింటారు. మ‌రి ఈ పోటీ ఎలా ఉంటుందో ? చూడాలి.