బిగ్ షాకింగ్: బన్నీ బీహేవీయర్ తో ఆ డైరెక్టర్ సీరియస్ ..అంత మాట అన్నాడా..?

సినీ ఇండస్ట్రీలో కొందరి ఫ్రెండ్ షిప్ చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. ఏళ్ల తరబడి..బెస్ట్ ఫ్రెండ్స్ గానే ఉంటారు. అలా మన టాలీవుడ్ హీరోలు, డైరెక్టర్లు, నిర్మాతలు బోలెడు మంది ఉన్నారు. కానీ, వాళ్లందరిలోకి ప్రత్యేకం..”త్రివిక్రమ్ శ్రీనివాస్-పవన్ కళ్యాణ్”..”సుకుమార్-బన్నీ”. వీళ్ల స్నేహం ఈనాటిది కాదు..ఏనాటి దో..కెరీర్ మొదలు నుంచి..అలానే ఉంటూ వస్తున్నారు. వీళ్ళ ఫ్రెండ్ షిప్ చూసి కుళ్ళు కునే వాళ్ళు ఇందస్ట్రీలో ఉన్నారు అనడంలో సందేహం లేదు.

- Advertisement -

అయితే, తాజాగా ఇండస్ట్రీలో ఓ కొత్త రూమర్ వైరల్ గా మారింది. ఇండస్ట్రీలోనే బెస్ట్ ఫ్రెండ్స్ గా ఉన్న సుకుమార్-బన్నీ మధ్య కోల్డ్ వార్ మొదలైంది అంటూ ఓ న్యూస్ నెట్టింట తెగ వైరల్ గా మారింది. దానికి రీజన్ లేకపోనూలేదు. బన్నీ-సుకుమార్ కాంబోలో పాన్ ఇండియా లెవల్ తెరకెక్కి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన మూవీ..”పుష్ప”. మొదటి భాగం డిసెంబరు 17, 2021 న రిలీజ్ అయ్యి ఇండస్ట్రీ లెక్కలని మార్చేసింది. ఒకటి కాదు రెండు కాదు బన్నీ కెరీర్ లోనే హైయెస్ట్ కలెక్షన్స్ సాధించిన మూవీగా రికార్డ్ నెలకోల్పింది.

అయితే, పుష్ప పార్ట్ 2 కూడా ఉంటుందని..ఆ సినిమాని కూడా..డిసెంబరు 17, 2022 న్ అ రిలీజ్ చేస్తానని సుకుమార్ చెప్పుకొచ్చారు. అయితే, ఇప్పటి వరకు పుష్ప పార్ట్ 2 కి సంబంధించిన షూటింగ్ పనులు మొదలవల్లేదు. ఇదిగో ఈరోజు, రేపు షూటింగ్ మొదలు అంటూన్నారే కానీ, ఇప్పటి వరకు సుకుమార్, బన్నీ ఇద్దరు దీని పై అఫిషీయల్ ప్రకటన ఇవ్వలేదు. మరో పక్క ..సుకుమార్ చెప్పిన పుష్ప 2 రిలీజ్ డేట్ దగ్గరకి వచ్చేస్తుంది. దీంతో బన్నీ సుకుమార్ మధ్య గొడవ అయ్యిందని..అందుకే సినిమా షూటింగ్ కి బ్రేక్ వేశారనే వార్త నెట్టింట జోరుగా ప్రచారం జరుగుతుంది. అంతేకాదు పుష్ప 1 షూటీంగ్ లోను బన్నీ కి సుకుమార్ కి మధ్య ఓ సీన్ విషయంలొ చిన్న మిస్ అండర్ స్టాండింగ్ వచ్చిందని ..అప్పట్లో వార్తలు వైరల్ అయ్యాయి. కోపంలో సుకుమార్ ..బన్నీ పై నోరు జారాడు అన్న కామెంట్స్ వినిపించాయి. మళ్ళీ ఇప్పుడు సుక్కు-బన్నీ మధ్య కోల్డ్ వార్ నడుస్తుంది అని వార్తలు రావడంతో..ఇండస్ట్రీలో అయోమయ పరిస్ధితి నెలకోంది..?

Share post:

Popular