NBK 107: గోపీచంద్ మలిలేనికి బాలయ్య ఛాన్స్ ఇవ్వడానికి కారణాలు ఇవేనా..?

అఖండ లాంటి అఖండ విజయం తర్వాత నట సింహం నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న పక్కా మాస్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ఎన్‌బికే 107. ఈ సినిమా కమిటైనప్పుడు బాలయ్య, అసలు ఈ దర్శకుడిగా ఎలా ఛాన్స్ ఇచ్చారు అని చర్చలు సాగాయి. దీనికి కారణం మూడేళ్ళ లాంగ్ గ్యాప్ తర్వాత క్రాక్ సినిమా భారీ సక్సెస్‌తో కంబ్యాక్ ఇవ్వడమే. ఇలా మూడు నాలుగేళ్ళ గ్యాప్ తర్వాత వచ్చిన దర్శకుడు ఓ హిట్ ఇచ్చి మళ్ళి అడ్రస్ లేకుండా పోయినవారు ఇండస్ట్రీలో చాలామందే ఉన్నారు. వారిలో కొందరు అగ్ర దర్శకులూ ఉన్నారు.

అందుకే, బాలయ్య గోపీచంద్ మలినేనికి అవకాశం ఇవ్వగానే హాట్ టాపిక్ అయింది. అయితే, దీనికి సాలీడ్ రీజన్స్ ఉన్నాయట. మూడేళ్ళ గ్యాప్ తర్వాత హీరో రవితేజ, హీరోయిన్ శృతి హాసన్‌లకు అలాగే, దర్శకుడు గోపీచంద్ మలినేనికి దక్కిన సాలీడ్ హిట్ క్రాక్ సినిమా. కరోనా సమయంలో పెద్ద రిస్క్ చేసి మరీ ఈ సినిమాను చేశారు. ఇది బాగా వర్కౌట్ అయింది. సజహంగా ఇలాంటి కథలు బాలయ్యకు బాగా సూటవుతాయి. బాలయ్య నటించిన లక్ష్మీ నరసింహ సినిమా ఇదే తరహాలో ఉంటుంది. రౌడీ ఇన్సెపెక్టర్ బాలయ్య కెరీర్‌లో పెద్ద హిట్. దీనికి దర్శకుడు బి గోపాల్.

గోపీచంద్ మలినేని కథ చెప్పే విధానం, క్రాక్ మూవీ అలాగే, గతంలో తీసిన డాన్ శీను సినిమాలలో మాస్ ఎలిమెంట్స్ బాగా ఉంటాయి. బాలయ్యకు యాక్షన్, మాస్ ఎంటర్‌టైనర్స్ బాగా సూటవుతాయి. ఇక బి గోపాల్ తరహాలోనే ఆయన కథ నరేట్ చేసి బాలయ్యను ఆకట్టుకున్నారట. అంతేకాదు, ఓ అభిమానిగా కథ చెప్పడం బాలయ్యకు బాగా నచ్చింది. అందుకే, గోపీచంద్ మలినేనికి సింగిల్ సిట్టింగ్‌లోనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట.

మేకింగ్ పరంగా తన సత్తా బాలయ్య ఏ రేంజ్‌లో ఉండబోతుందో కథ చెప్పే దర్శకుడి విషయంలో ఖచ్చితంగా అంచనాకు వచ్చేస్తారు. ఇలాంటి స్ట్రాంగ్ రీజన్స్ వల్ల బాలయ్య – గోపీచంద్ మలినేని కాంబో సెట్ అయింది. ఇక ఈ సినిమాను వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందించడం విశేషం. ఖచ్చితంగా ఎన్‌బీకె 107 బాకాఫీస్ వద్ద భారీ స్థాయిలో బ్లాస్ట్ అవడం ఖాయం. రికార్డుకు తిరగరాయడం పక్కా అని ఫ్యాన్స్ రాసిపెట్టుకోవచ్చు.