బిగ్ బ్రేకింగ్: తల్లి కాబోతున్న అలియా భట్..స్వయంగా ప్రకటించిన బాలీవుడ్ బ్యూటీ..!

యస్.. బాలీవుడ్ హాట్ బ్యూటీ స్టార్ కిడ్ అలియా భట్ తల్లి కాబోతుందా అంటే అవుననే అంటున్నాయి బాలీవుడ్ వర్గాలు. బాలీవుడ్ స్టార్ కిడ్ గా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అలియా… ఇండస్ట్రీలోకి వచ్చిన అతి తక్కువ టైంలోనే మంచి మంచి సినిమాలు చేసి..స్టార్ హీరోయిన్ల లిస్ట్ లోకి వెళ్లిపోయింది. అయితే, గత కొంత కాలంగా బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ తో ప్రేమలో ఉన్న అలియా.. ఫైనల్ గా ఎట్టకేలకు ఇష్టపడిన వాడినే పెళ్లి చేసుకుని..అతనికి భార్య గా మారింది.

- Advertisement -

ఏప్రిల్ 14 న చాలా సింపుల్ గా అతి తక్కువ మంది సన్నిహితులు, ఫ్రెండ్స్ , బంధువుల మధ్య పెళ్లి చేసుకుని..రణబీర్-అలియా ఒక్కటైయ్యారు. పెళ్లి తరువాత కూడా ఫ్యామిలీ లైఫ్ ను ఎంజాయ్ చేయకుండా..ఇద్దరు వెంటనే సినిమా షూటింగ్స్ కు వెళ్లిపోయారు. ఆ తరువాత ఫ్రీ టైం తీసుకుని హనీమూన్ కి వెళ్లి..ఆ పిక్స్ ని సోషల్ మీడియా లో పోస్ట్ చేసి..కుర్రాళ్లకు మతులు పొగొట్టారు. ప్రజెంట్ అలియా-రణబీర్ ఇద్దరు కూడా బడా బడా ప్రాజెక్ట్స్ కు కమిట్ అయ్యి బిజీ గా ఉన్నారు.

అయితే, తాజాగా ఈ జంట అభిమానులకు గుడ్ న్యూస్ వినిపించింది. ఏప్రిల్ లో పెళ్లి చేసుకున్న ఈ జంట ..చాలా త్వరగా అభిమానులకు తీపి కబురు అందించింది. రీసెంట్ గా అలియా తన ఇన్ స్టా గ్రామ్ లో ఓ ఫోటోని షేర్ చేసింది. ఈ పిక్‌లో ఆలియా ఆస్పత్రిలోని బెడ్‌పై పడుకుని ఉండగా… పక్కన టీవీ మానిటర్‌లో లవ్ సింబల్ కనిపిస్తోంది. దీంతో ఆమె ప్రెగ్నెంట్ అంటూ అఫిషీయల్ గా అనౌన్స్ చేసిన్నట్లైంది. ఈ గుడ్ న్యూస్ తో అలియా-రణబీర్ లకు సోషల్ మీడియాలో శుభాకాంక్షల వెల్లువ మొదలైంది. ఈ జంటకు పలువురు బడా సెలబ్రిటీలు కంగ్రాట్స్ అంటూ విషెష్ అందిస్తున్నారు.

Share post:

Popular