IDMB రేటింగ్‌లో సీనియ‌ర్‌ ఎన్టీఆర్ టాప్ – 10 సినిమాలు ఇవే…!

సీనియర్ ఎన్టీఆర్ తన కెరియర్లో దాదాపుగా 300 కు పైగా సినిమాలలో నటించి మంచి విజయాలను అందుకున్నారు. ఈతరం ప్రేక్షకులలో చాలామంది సీనియర్ ఎన్టీఆర్ నటన చూసి ఆశ్చర్యపోయిన వారూ కూడా ఉన్నాయి. అన్ని సినిమాలలో సీనియర్ ఎన్టీఆర్ నటించారు అంటే సినిమాల కోసం ఎంత కష్టపడ్డారో మనకు అర్థమవుతుంది. ఇక రీసెంట్ గా మే 28 న సీనియర్ ఎన్టీఆర్ 100 వ పుట్టినరోజు కావడంతో ఆయన గురించి పలు విషయాలు సోషల్ మీడియా వేదికగా చర్చ జరుగుతూనే ఉంది.

ఇప్పుడు ఎన్టీఆర్ నటించిన కొన్ని చిత్రాల రేటింగ్ గురించి చూద్దాం. ఎన్టీఆర్ నటించిన రక్తసంబంధం IDMB రేటింగ్-8.8 కావడం గమనార్హం. సీనియర్ ఎన్టీఆర్ కెరియర్లో ప్రత్యేకమైన సినిమా లో ఒకటైన మాయాబజార్ చిత్రం -9.1 రేటింగ్ లభించింది. సీనియర్ ఎన్టీఆర్ కెరియర్లో బ్లాక్ బస్టర్ హిట్స్ లలో ఒకటైన మిస్సమ్మ చిత్రం కూడా..8.6 రేటింగ్ లభించింది.

ఎన్టీఆర్ అభిమానులు ఎంతగానో అభిమానించే చిత్రా లలో ఒకటైన దానవీరశూరకర్ణ చిత్రం..8.9 రేటింగ్ కలదు. ఎన్టీఆర్ నటించిన యమగోల చిత్రం-7 రేటింగ్ కలదు. నర్తనశాల సినిమా కు మాత్రం-8 రేటింగ్ కలదు. గుండమ్మ కథ సినిమా కి మాత్రం-8.8 కాగా లవకుశ చిత్రానికి -8.1 ఉన్నది.. ఎన్టీఆర్ నటించిన బడిపంతులు సినిమా మాత్రం-7 రేటింగ్ కలదు. సీనియర్ ఎన్టీఆర్ నటించిన పెళ్లి చేసి చూడు సినిమాకి మాత్రం -8.5 రేటింగ్ కలదు. సీనియర్ ఎన్టీఆర్ నటించిన చిత్రాల్లో ఎక్కువ సినిమాలు అధిక రేటింగ్ సొంతం చేసుకున్నాయి.

ఎన్టీఆర్ సినిమాలు సాధించిన కలెక్షన్లు కూడా ఇప్పటికీ టికెట్ల పరంగా చూస్తే ఊహించని మొత్తం ఉన్నట్లుగా టాక్ వినిపిస్తోంది. తెలుగులో మొట్టమొదటి కోటి రూపాయల రెమ్యునరేషన్ అందుకున్న హీరో కూడా సీనియర్ ఎన్టీఆర్ కావడం గమనార్హం. సీనియర్ ఎన్టీఆర్ తెలుగు ప్రజల హృదయాలలో మంచి వ్యక్తిగా నిలిచిపోవడం గమనార్హం. అందుచేతనే ఇప్పటికి ఎన్టీఆర్ కుటుంబాన్ని అభిమానిస్తూనే ఉన్నారు ప్రజలు.