ఈ అమ్మడు చేసిన పనికి అంతా షాక్..పబ్లిక్ లోనే అలా(వీడియో)..!!

బాలీవుడ్ కండల వీరు సల్మాన్ ఖాన్ గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఎన్నీ సినిమా లో నటించి..తన నటనతో ప్రత్యేకమైన డ్యాన్స్ తో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నారు. ఆయన ఇండస్ట్రీలోకి వచ్చి ..చాలా కాలమే అవుతుంది. అయినా ఇప్పటికి హీరో గా సినిమా లు చేస్తూ.. ఇండస్ట్రీకి వస్తున్న యంగ్ హీరోలకి గట్టి పోటీఇస్తున్నారు. మనకు తెలిసిందే సల్మాన్ ఖాన్ ఇప్పటి వరకు పెళ్లి చేసుకోలేదు . ఆయన వయసు 56..ఇక పై పెళ్లి చేసుకుంటారు అనే నమ్మకాలు ఫ్యాన్స్ కి లేవు.

కానీ, సల్మాన్ అంటే అమ్మాయిలు పడి చచ్చిపోతారు. ఆయన నటన కు కొందరు పడిపోతే.. ఆయన ప్రత్యేకమైన డ్యాన్స్ కి మరికొందరు ఫిదా అవుతుంటారు. ఇక సల్మాన్ బిగ్ షోకి హోస్ట్ గా చేస్తుంటారు అన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే అందరి కంటెస్టెంట్ లకి బాగా దగ్గర అవుతాడు సల్మాన్. ఇక అలా ‘బిగ్ బాస్ 13’ సీజన్ నుండి కండల వీరుడు సల్మాన్ ఖాన్ కి బిగ్ బాస్ కంటెస్టెంట్ షెహ్నాజ్ గిల్ మధ్య ఓ ప్రత్యేకమైన బాండ్ ఏర్పడైంది. ఇక ఆ బాండ్ సిద్ధార్థ్ శుక్లా ఆకాల మరణం తర్వాత మరింత స్ట్రాంగ్ అయిందంటున్నారు బాలీవుడ్ వర్గాలు.

ఇక అలా అలా వీళ్ల మధ్య స్నేహ బంధం బాగా స్ట్రాంగ్ అయ్యింది. షెహ్నాజ్‌కు సపోర్ట్‌గా ఉన్న సల్లూ భాయ్.. ఇప్పుడు తనకు బెస్ట్ ఫ్రెండ్‌గా మారిపోయాడు అని వాళ్ల క్లోజ్ నెస్ బట్టే అర్ధమవుతుంది. ఈ క్రమంలోనే సల్మాన్ సిస్టర్ అర్పితా ఖాన్ శర్మ కండక్ట్ చేసిన ఇఫ్తార్ విందులో పాల్గొన్నింది షెహ్నాజ్. అక్కడ కు వచ్చిన వారు కళ్లు అన్ని ఆమె మీదే. అంత అందమ గా రెడీ అవ్వడం ఒక్క రీజన్ అయితే..ఆక్కడ ఆమె సల్మాన్‌తో మెదిలిన తీరు అందరికి షాకింగ్ గా అనిపించిందట. చూడటానికి క్యూట్‌ క్యూట్‌గా ఉన్న షెహ్నాజ్..సల్మాన్ ని క్షణం కూడా వదలకుండా..వెంట ఉండటం..ఆయనను హగ్ చేసుకోవడం.. పదే పదే ముద్దులు పెట్టడం, మళ్ళీ ముసిముసి నవ్వులతో మురిసిపోవడం.. పార్టీలో అందరికి షాకింగ్ గా అనిపించిందట. దీంతో ఇఫ్తార్ విందులో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది షెహ్నాజ్. అంతేనా ఇక లాస్ట్ కి వెళ్లిపోయే టైం లో కూడా సల్మాన్‌ చేయి వదలలేదు. ఆయన చెయ్యి గట్టిగా పట్టుకుని మరీ తన కారు వరకు తీసుకెళ్లి ‘సల్లూ జీ నన్ను డ్రాప్ చేయడానికి వచ్చాడు’ అని మీడియాకు చెప్తూ సంబరపడిపోయింది. దీంతో ఆ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.