NTR కు ఫ్యాన్స్ స్పెషల్ రిక్వెస్ట్..తారక్ తీరుస్తాడా..?

దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తారాక్ రీసెంట్ గా నటించిన సినిమా..RRR. ఈ సినిమాతో బిగ్గెస్ట్ విజయాని తన ఖాతాలో వేసుకున్న తారక్..ఇప్పుడు కొరటాల శివతో ఓ సినిమా చేయబోతున్నాడు. పొస్ట్ ప్రోడక్షన్స్ పనులు కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా జూన్ రెండో వారలో లాంఛనం గా ప్రారంభం కానుందనే టాక్ వినిపిస్తుంది. ఈ సినిమా పై తారక్ అభిమానులు బోలెడు ఆశలు పెట్టుకుని ఉన్నారు.

ఇది వరకే వీళ్ళ కాంబోలో జనత గ్యారేజ్ లాంటి బ్లాక్ బస్టర్ సినిమా రావడంతో..ఈ సినిమా పై భారీ అంచనాలను పెట్టుకుని ఉన్నారు ఫ్యాన్స్. కాగా రీసెంట్ గా తారక్ బర్త డే సంధర్భంగా రిలీజ్ అయిన మోషన్ వీడియో అభిమానులను బాగా ఆకట్టుకుంటుంది. సినిమా లోని తారక్ లుక్స్ చూస్తుంటే సినిమా మాస్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కబోతుందని అర్ధమైపోతుంది. ఈ క్రమంలోనే ఫ్యాన్స్ ఆది సినిమా రేంజ్ లో ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు.

నిజానికి తారక్ ఫుల్ మాస్ రోల్ లో కనిపించి చాలా ఏళ్ళు అవుతుంది. నిజానికి సినీ ఇండస్ట్రీలో జనాలకు దగ్గరవ్వాలంటే..మాస్ ఇమేజ్ కంపల్సరీ..అప్పుడే వాళ్లు ఈజీగా పైగి ఎదుగుతారు. ఆల్రెడీ ఆ మాస్ ఇమేజ్ సంపాదించుకున్నాడు తారక్. కాకపోతే ఈ మధ్య కాలంలో అంతా సాఫ్ట్ రోల్స్ లోనే కనిపిస్తున్నాడు . ఇక తారక్ ని ఆది కేశవ రెడ్డి లాంటి పాత్రలో చూడాలి ఆశపడుతున్నారు . కొందరు సోషల్ మీడియా వేదిక గా అదే విషయాని చెప్పుకొచ్చారు. ఇక తాజా గా రిలీజ్ అయిన తారక్ లుక్స్..ఆ చేతిలో కత్తి..దానికి అంటుకున్న రక్తం చూస్తుంటే ..అభిమానుల కోరికను తీర్చేస్తాడు అని చెప్పక తప్పదు . అంత బాగానే ఉన్నా..సినిమాలో ఇంకా హీరోయిన్ ని ఫిక్స్ చేయలేదు కొరటాల. కత్తి లాంటి అమ్మాయి కోసం సెర్చ్ చేస్తున్నాడట..?