“Thank You”: సమంత కి గూబ గుయ్యమనే ఆన్సర్ ఇచ్చిన చైతూ…?

సోషల్ మీడియాలో ఎవర్ గ్రీన్ హాట్ టాపిక్ ఏదైన ఉంది అంటే అది “నాగచైతన్య-సమంత”. కలిసి సినిమాలు చేసినప్పుడు..లవ్ లో ఉన్నప్పుడు..ఆఖరికి పెళ్లి చేసుకున్నప్పుడు కూడా ఇంత గా న్యూస్ లు వీళ్ల పై రాలేదు. కానీ, సమంత చేసిన ది ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ విడుదలైనప్పటి నుండి.. వీళ్ల మధ్య జరిగే ప్రతి విషయం జనాలకు ఇంట్రెస్టింగా మారింది..మీడియాలో వైరల్ గా మారింది. కొన్ని రోజులు కవర్ చేసిన ఈ జంట ..ఫైనల్లీ విడాకులు తీసుకుంటున్నాం అని ప్రకటించేశారు.

దీంతో వీళ్ల పై ట్రోలింగ్ స్టార్ట్ అయ్యింది. అక్కినేని కోడలు పిల్ల ట్యాగ్ తీసేసిన సమంత..ఇప్పుడు ఫ్రీ బార్డ్ అయిపోయింది. తనకు నచ్చిన్నట్లు ఉంటూ..తింటూ..జాలీ గా గడిపేస్తుంది. అంతేనా సినిమాలో హద్దులు దాటేసి మాట్లాడుతుంది..ప్రవర్తిస్తుంది . అంతేకాదండోయ్ ..బికినీ వేసి..ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పెట్టి..నానా రచ్చ చేసింది. డైరెక్ట్ గా కాకపోయినా పరోక్షంగా..అక్కినేని ఫ్యామిలీకి కౌంటర్లు ఇస్తూనే వచ్చింది.

కానీ, అక్కినేని ఫ్యామిలీ మాత్రం ఇప్పటి వరకు ఆమె పై డైరెక్ట్ గా కానివ్వండి..పరోక్షంగా కానివ్వండి..ఒక్క మాట కూడా మాట్లాడలేదు. కానీ, ఫస్ట్ టైం చైతూ ..సమంత కి చెంప దెబ్బ లాంటి ఆన్సర్ ఇచ్చాడని..వార్తలు వైరల్ అవుతున్నాయి. రీసెంట్ గా నాగ చైతన్య నటించిన సినిమా “ధ్యాంక్యూ ” టీజర్ విడుదలైంది. ఎటువంటి హంగామా లేకుండా సింపుల్ గా స్లో గా సాగిన టీజర్ అందరిని ఆకట్టుకుంటుంది. ఈ క్రమంలోనే చైతూ తన గతాని ఉద్దేశిస్తూ..”లైఫ్ లో కాంప్రమైజ్ అయ్యేదే లేదు .. ఎన్నో వదులుకుని ఇక్కడికి వచ్చాను” అనే చైతూ ఓ డైలాగ్ చెప్పుతాదు. ఆ డైలాగ్ ను క్రాప్ చేసి సమంత విడాకుల పోస్ట్ కి మ్యాచ్ చేస్తూ..కొందరు ట్రోలర్స్ ఆమెని ట్రోల్ చేస్తున్నారు. కొందరు అయితే సమంతకి ఈ కరెక్ట్ ఆన్సర్ ఇచ్చాడు చైతూ అంటూ పొగిడేస్తున్నారు. అయితే నిజంగా ఆ డైలాగ్ చైతూ సమంతని ఉద్దేశించి చెప్పాడొ లేదో తెలియదు కానీ..ఆ డైలాగ్స్ మాత్రం వాళ్ల ప్రజెంట్ సిట్యూవేషన్ కి కరెక్ట్ గా ఉన్నాయంటున్నారు జనాలు. కాగా ప్రకాశ్ రాజ్ కీలకమైన పాత్రను పోషించిన ఈ సినిమాను, జూలై 8వ తేదీన విడుదల చేయనున్నారు.