ఆ విషయంలో బాలయ్య-తారక్ ఒక్కే మాట..సూపరో సూపర్..!!

ఇండస్ట్రీలో ఎన్ని బడా ఫ్యామిలీలు ఉన్నా..నందమురి పేరుకు ఓ ప్రత్యేక చరిత్ర ఉంది. అలాంటి పేరు ని సంపాదించిపెట్టారు స్వర్గీయ నందమూరి తారక రామరావు గారు. ఆయన పేరు చెప్పుకుని ఇందస్ట్రీలోకి వచ్చిన కొడుకు బాలకృష్ణ..మనవడు తారక్..ఇద్దరు ఇప్పుడు టాప్ ప్లేస్ లో ఉన్నారు. నందమూరి అభిమానులకు బాలకృష్ణ-ఎన్టీఆర్ రెండు కళ్లలాంటి వారు. ఇద్దరిని సమానంగా ఆదరిస్తూ..టాప్ హీరో ల లిస్ట్ లో కూర్చో పెట్టారు. ఈ మధ్య నే అఖండ సినిమా తో బాలయ్య.. RRR సినిమా తో ఎన్టీఆర్ కెరీర్ లో బ్లాక్ బస్టర్ హిట్ లు అందుకున్నారు.

ఇక ఇప్పుడు ఇద్దరు కూడా తమ తమ నెక్స్ట్ సినిమాల పై దృష్టి పెట్టారు. గోపీచంద్ డైరెక్షన్ లో బాలయ్య ఓ సినిమా చేస్తుండగా..ఆ సినిమా కంప్లీట్ అవ్వగానే ..ఫ్యామిలీ డైరెక్టర్ అనిల్ రావిపూడితో మరో సినిమాకు పచ్చ జెండా ఊపారు బాలయ్య. ఈ సినిమా పై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నారు. ఈ సినిమాలో బాలయ్యను మనం ఎప్పుడు చూడని ఢిఫరెంట్ గెటప్ లో చూడబోతున్నాం అంటూ హింట్ ఇచ్చి అనిల్ సినిమా పై హైప్ ఇచ్చారు. కాగా ఈ సినిమాకి సంగీత దర్శకుడిగా కోలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుథ్ ని ఫిక్స్ చేసుకున్నారట బాలయ్య. ఎప్పుడు ఒక్కేలా లేకుండా కూసింత స్టైల్ గా ట్రెండీగా ఉండేలా ప్లాన్ చేసిన్నట్లు తెలుస్తుంది.

అయితే, ఇక్కడ ఆశ్చర్య కలిగించే విషయం ఏమీటంటే.. బాబాయ్ సెలక్ట్ చేసుకున్న అనిరుథ్ ని అబ్బాయ్ తారక్ ఎప్పుడు బుక్ చేసి పెట్టుకున్నారు. కొరటాల డైరెక్షన్ లో తారక్ ఓ సినిమా కు కమిట్ అయిన సంగతి తెలిసిందే. అన్ని కలిసి వచ్చుంటే ఈ సినిమా ఎప్పుడో స్టార్ట్ అయ్యుండేది. కానీ, RRR ప్రమోషన్స్ , ఆచార్య సినిమా రిలీజ్ కారణంగా కొరటాల తారక్ సినిమా వాయిదా పడుతూ పడుతూ.. ఫైనల్ గా వచ్చే నెల మొదటి వారంలో షూటింగ్ పనులు ప్రారభించేలా ప్లాన్ చేసుకున్నారు టీం. కాగా ఈ సినిమాలో నిన్న మొన్నటి వరకు అలియా అంటూ ప్రచారం జరిగిన.. అమ్మడు పెళ్లి చేసుకుని బిజీ అయిపోయింది అని..ఆ ప్లేస్ లోకి నేషనల్ క్రష్ రష్మిక ను ఎంపిక చేశారట కొరటాల. అయితే, ఈ సినిమా కు సంగీత దర్శకుడిగా అనిరుథ్ నే ఫిక్స్ చేశారట కొరటాల-తారక్. ఈ మధ్య వచ్చిన బీస్ట్ సినిమా లో అనిరుథ్ మ్యూజిక్ చూసి ఫిదా అయిన తారక్ తన 30వ సినిమా కోసం అనిరుథ్ సెలక్ట్ చేసుకున్నారంటూ వార్తలు వస్తున్నాయి. ఇక బాలయ్య అనిల్ సినిమాకి కూడా అనిరుథ్ నే ఫిక్స్ అని దాదాపు ఖరారు అయ్యిన్నట్లు తెలుస్తుంది. మరి చూడాలి ఈ తమిళ కుర్రాడు మనళ్లోకి ఏ మాత్రం సక్సెస్ ఇస్తాడో..?