ప‌వ‌న్ తో సినిమా చేయను..బండ్లన్న భళే ట్వీస్ట్ ఇచ్చాడే..!!

టాలీవుడ్ ఇండస్ట్రీ లో ఈ రెండు పేర్లుకి పరిచయం అవసరం లేదు. బాగా తెలిసిన వ్యక్తులే. ఇంకా చెప్పాలంటే జాన్ జిగిడి దోస్తులు. మంచి మంచి హిట్ సినిమాలు వచ్చాయి వీళ్ల కాంబోలో. బండ్ల గణేష్ కు ప‌వ‌న్ అంటే చాలా ఇష్టం . ఈ విషయం లో ఎన్నో సార్లు ఆయన మీడియా ముఖంగా నే చెప్పుకొచ్చారు. అంతేనా పవన్ సినిమా ఫంక్షన్ లో ఆయన ఉంటే ఆ కిక్కే వేరు . ఆయన మైక్ పట్టుకుని పవణేశ్వరా..అంటుంటే.. ఫ్యాన్స్ లో పూనకాలు..శత్రువుల కళ్లల్లో భయం మొదలవుతుంది. అంత గూస్ బంప్స్ తెప్పిస్తాయి బండ్ల గణేష్ మాటలు.

మొదటి నుంచి వీళ్ళు మంచి ఫ్రెండ్స్. కానీ మధ్యలో పొలిటికల్ గా వేరు వేరు పార్టీలు కారణంగా కొంచెం గ్యాప్ ఏర్పడింది. కానీ ఫ్రెండ్ షిప్ ముందు ఏం అడ్డురావు అంటూ.. పాలిటిక్స్ విషయాలను పక్కన పెట్టేసి.. మళ్ళీ సినిమాల పరంగా ఇద్దరు కలుసుకున్నారు. పవన్ ను ఆరాధించే కోట్లాది జనంలో..బండ్లన్న ఒకరు. ఆయన దేవుడు పవన్ కళ్యాణ్. ఈ విషయం ఆయన ఇంటర్వ్యులు చూస్తే క్లీయర్ కట్ గా అర్ధమైపోతుంది. అయితే, ఆ మధ్య పవన్ తో ఓ సినిమా అంటూ ఫిక్స్ అయిన బండ్ల గణేష్.. ఆ తరువాత దాని గురించిన అప్డేట్ నే లేదు. దీంతో సినిమా ఆగిపోయింది. మళ్ళీ వీళ్ల మధ్య లొల్లి స్టార్ట్ అయ్యింది అంటూ వార్తలు వచ్చాయి.

కానీ, అవి నిజం కాదంటూ రీసెంట్ ఇంటర్వ్యులో బండ్లన్న క్లారిటీ ఇచ్చాడు.ఆయన మాట్లాడుతూ..” పవన్ కళ్యాణ్ తో ఆగిపోయిన మాట నిజమే. కాని, గొడవల వల్ల కాదు. నేను కావాలనే సినిమా ని ఆపేశా. పవన్ ప్రస్తుతం రాజకీయాల్లో బిజీ గా ఉన్నారు. ఇంకా మూడు నాలుగు సినిమాలు కమిట్ అయ్యి ఉన్నారు. వీటి అన్నింటిని బ్యాలెన్స్ చేస్తూ..సినిమాలు తీయాలంటే కష్టం. నాకు పవన్ సీ ఎం గా చూడాలి అని ఉంది. అందుకే సినిమా ఆపేసా.. ఆయన ఫ్రీ అయ్యాక మిగతా సినిమాలను పూర్తి చేసుకుని నాకు అవ‌కాశం ఇస్తే త‌ప్ప‌కుండా చేస్తా. కానీ, నాకు పవన్ ని ముఖ్యమంత్రి గానే చూడాలి అని ఉంది” అంటూ క్లారిటీ ఇచ్చాడు . అంతేకాదు..తనదైన స్టైల్లో ..”నేను నాగార్జున సాగ‌ర్‌ లాంటి వాడిని.. డ్యామ్ లోకి నీళ్లు వ‌స్తుంటాయి.. పోతుంటాయి. అన్ని నీళ్లు నావే అని అనుకోకూడ‌దు. వాళ్లంద‌రూ ఆ టైపే. సినిమాలు అంటే నాకు కిష్టం, సినిమానే నా ప్రాణం. ఖచ్చితంగా సినిమాలు తీస్తా..” అంటూ చెప్పుకొచ్చారు.