ఇండ‌స్ట్రీలో విషాదం… KGF నటుడు మృతి

గ‌త రెండేళ్లుగా సినిమా ప‌రిశ్ర‌మ‌ను వ‌రుస‌గా విషాదాలు వెంటాడుతూనే ఉన్నాయి. ప‌లువురు స్టార్ హీరోలు, సినిమా సెల‌బ్రిటీలు, సంవ‌త్స‌రాలుగా ఇండ‌స్ట్రీలో రాణిస్తోన్న వారు వ‌రుస‌గా ఏదో ఒక కార‌ణంతో మృతి చెందుతూ ఉన్నారు. గ‌త యేడాది కాలంలోనే తెలుగు సినిమా ప‌రిశ్ర‌మ ఎంతో మంది టాలెంట్ ఉన్న వ్య‌క్తుల‌ను కోల్పోయింది. అలాగే సీనియ‌ర్ నిర్మాత‌లు… ఒక‌ప్పుడు ఇండ‌స్ట్రీని ఏలిన ద‌ర్శ‌కులు కూడా స‌డెన్‌గా మృతి చెందుతున్నారు.

క‌రోనా దెబ్బ‌తోనే మ‌న సౌత్ సినిమా ఇండ‌స్ట్రీ ఎంతో మంది ప్ర‌ముఖుల‌ను కోల్పోయింది. మ‌రి కొంద‌రు వ‌య‌స్సు పైబ‌డ‌డం, అనారోగ్యం కార‌ణాల‌తో మృతి చెందారు. ఈ నేప‌థ్యంలో సినిమా ప‌రిశ్ర‌మ‌లో మ‌రో విషాదం చోటు చేసుకుంది. క‌న్న‌డ న‌టుడు మోహ‌న్ జూనేజా ఈ రోజు మృతి చెందారు. గ‌త కొంత కాలంగా ఆయ‌న అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్నారు.

ఆయ‌న ప‌రిస్థితి సీరియ‌స్‌గా ఉండ‌డంతో బెంగ‌ళూరులోని ఓ ప్రైవేటు ఆసుప‌త్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆయ‌న హాస్య న‌టుడిగా అటు క‌న్న‌డంతో పాటు ఇటు త‌మిళంలోనూ, హిందీలోనూ ఎన్నో సినిమాల్లో న‌టించారు. ఆయ‌న స్టార్ హీరోల బ్లాక్‌బ‌స్ట‌ర్ సినిమాల్లో కూడా కీల‌క పాత్ర‌లు చేశారు.

ఇటీవ‌ల వ‌చ్చిన బ్లాక్‌బ‌స్ట‌ర్ కేజీయ‌ఫ్ 2లో కూడా సంద‌డి చేశారు. ఈ సినిమాలో చిన్న పాత్ర వేసినా అది త‌న‌కు ఎంతో సంతృప్తి ఇచ్చింద‌ని తెలిపారు. మోహ‌న్ మృతి ప‌ట్ల శాండ‌ల్‌వుడ్‌కు చెందిన ప‌లువురు ప్ర‌ముఖులు సంతాపం తెలిపారు.